Unstoppable With NBK 2: బావను ఆట పటిస్తాడా ? లేదా భయపడతాడా ?.. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ పై పెరుగుతున్న హైప్..
గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్”.. ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. ఈసారి మీకోసం మరింత రంజుగా
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో యాంకరింగ్‌కు సరికొత్త స్టై్ల్ తీసుకువచ్చారు నందమూరి నటసింహం బాలకృష్ణ. యాక్షన్ చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన బాలయ్య.. తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ షో భారీ విజయాన్ని అందుకుంది. అతిథులను తనదైన కామెడీతో ఆటపట్టిస్తూ.. ఆడియన్స్ మదిలో ఉన్న ప్రశ్నలకు సున్నితంగా సమాధానాలు రాబట్టి మెప్పించారు బాలయ్య. ఇక ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సీజన్ 2 ట్రైలర్ ఆకట్టుకుంది. అంతేకాకుండా ట్రైలర్లో మరింత పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ సీరియస్‌గా కనిపించారు బాలయ్య. “గెలుపే ఊపిరిగా.. పట్టుదలే ప్రాణంగా.. ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్”.. ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. ఈసారి మీకోసం మరింత రంజుగా అంటూ సీజన్ 2పై మరింత పైప్ క్రియేట్ చేశారు.
ఇక ఇప్పుడు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ షోకు మొదటి అతిథిగా చంద్రబాబు రాబోతున్నారు. ఇదే విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. వీరిద్దరు కలిసిన ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 14న స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేసింది ఆహా. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బాలయ్య, చంద్రబాబు కలిసున్న పోస్టర్ రిలీజ్ చేస్తూ.. టూ లెజెండ్స్ వన్ సెన్సెషనల్ ఎపిసోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కాకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ బాలయ్య నటించనున్నారు.
Let’s begin the show!??? Blockbuster show #UnstoppableWithNBK returns with Season 2, and who better than @ncbn garu to start with. This one will be a sensational episode.? Debbaku thinking maaripovaala? From October 14th, only on aha! pic.twitter.com/DTVgdK9zdm
— ahavideoin (@ahavideoIN) October 10, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.