Rasavathi OTT: ఓటీటీలోకి అర్జున్ దాస్ రొమాంటిక్ థ్రిల్లర్.. ‘రసవతి’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

అర్జున్ దాస్.. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ తెలుగుప్రేక్షకులకు కూడా ఇతను బాగా సుపరచితమే. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో అర్జున్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా అర్జున్ గంభీరమైన గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో ఆక్సిజన్, బుట్టబొమ్మ సినిమాల్లో నటించిన అర్జున్ దాస్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు

Rasavathi OTT: ఓటీటీలోకి అర్జున్ దాస్ రొమాంటిక్ థ్రిల్లర్.. రసవతి స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Rasavathi Movie

Updated on: Jun 19, 2024 | 12:43 PM

అర్జున్ దాస్.. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ తెలుగుప్రేక్షకులకు కూడా ఇతను బాగా సుపరచితమే. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో అర్జున్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా అర్జున్ గంభీరమైన గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో ఆక్సిజన్, బుట్టబొమ్మ సినిమాల్లో నటించిన అర్జున్ దాస్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ దాస్ ఇటీవల రసవతి అనే ఒక తమిళ చిత్రంలో నటించాడు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రసవతి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అర్జున్ దాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రసవతి సినిమా ఈ శుక్రవారం జూన్ 21వ తేదీ నుంచి ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు ఎమోషన్స్ రోలర్‌ కోస్టర్‌కు సిద్ధమవండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా.

 

ఇవి కూడా చదవండి

అయితే, రసవతి సినిమా తెలుగు డబ్బింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఆహా. మరి భవిష్యత్తులో అయినా ఈ మూవీ తెలుగు వెర్షన్‍ను ఆహా తీసుకొస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది కాబట్టి తెలుగులో కి వచ్చే అవకాశాలు లేకపోలేదు. వెంటనే రాకపోయినా మరికొన్ని రోజుల్లో తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. శాంతా కుమార్ రసవతి సినిమాలో రేష్మ వెంకటేశ్, సుజీత్ శంకర్, జీఎం సుందర్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియం కీలకపాత్రలు పోషించారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. మరి థియేటర్లలో ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకున్న రసవతి సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.