AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhootha: ఆకట్టుకుంటున్న దూత ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో రానున్న అక్కినేని హీరో

Naga Chaitanya Birthday: సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నాగ్ చైతన్య ఇలా వెబ్ సిరీస్ కూడా చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ కే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మనం, థాంక్యూ సినిమాలు వచ్చాయి. మనం సినిమా సూపర్ హిట్ కాగా.. థాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది.

Dhootha: ఆకట్టుకుంటున్న దూత ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో రానున్న అక్కినేని హీరో
Dhootha
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2023 | 10:52 AM

Share

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సినిమాల్లో దూసుకుపోతూనే ఇప్పుడు డిజిటల్ లోనూ అడుగు పెట్టారు. నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నాగ్ చైతన్య ఇలా వెబ్ సిరీస్ కూడా చేయడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ కే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మనం, థాంక్యూ సినిమాలు వచ్చాయి. మనం సినిమా సూపర్ హిట్ కాగా.. థాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా దూత ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దూత సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. మర్డర్ మిస్టరీ గా ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సిరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ క్రైమ్ లో తనకు సంబంధం లేకున్నా ఇరుక్కుపోయినట్టు చూపించారు.

ఒక కార్టూన్ లో చూపిన విధంగానే మర్డర్ జరగడం.. ఆ నింద నాగచైతన్య పై పడటం చూపించారు. ఈ కేసు నుంచి నాగ చైతన్య ఎలా బయట పడ్డాడు. అసలు క్రైమ్స్ చేస్తున్నది ఎవరు..? అన్నది నాగ చైతన్య ఎలా తెలుసుకున్నాడు అన్నది ఈ సిరీస్ లో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మత్యకారుల బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

నాగ చైతన్య ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా