AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha: కార్తీక దీపం మేకర్స్ తెరకెక్కిస్తోన్న ‘మిస్టర్ పెళ్లాం’ సిరీస్.. ఆహాలో ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా..

ఇప్ప‌టికే ఆహా త‌న స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అంతులేని ఆనందాన్ని అందించ‌టంలో ముందుంటుంది. దీంతో పాటు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అందించ‌టానికి ఆహా సిద్ధమైంది అందులో భాగంగా

Aha: కార్తీక దీపం మేకర్స్ తెరకెక్కిస్తోన్న 'మిస్టర్ పెళ్లాం' సిరీస్.. ఆహాలో ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా..
Aha Mr Pellam
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2022 | 7:26 PM

Share

తెలుగు ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. డిజిటిల్ రంగంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా. ఎప్పుడూ సూపర్ హిట్ చిత్రాలు.. టాక్ షోస్.. డాన్స్, సింగింగ్ షోస్ మాత్రమే కాకుండా.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. మొదటిసారి తెలుగు ఓటీటీ ప్రియులకు కోసం ఓ డెయిలీ సిరీస్‌ను అందిస్తుంది. ఇప్ప‌టికే ఆహా త‌న స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అంతులేని ఆనందాన్ని అందించ‌టంలో ముందుంటుంది. దీంతో పాటు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అందించ‌టానికి ఆహా సిద్ధమైంది అందులో భాగంగా న‌వంబ‌ర్ 28 మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌తి సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ‘మిస్ట‌ర్ పెళ్లాం’ అనే డెయిలీ తెలుగు సిరీస్‌ను ఫ్రీగా అందిస్తుంది.దీని ద్వారా రెగ్యుల‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌తో పాటు కొత్త యూజ‌ర్స్ సైతం దీన్ని ఒక్క క్లిక్ డౌన్ లోడ్‌తో సరికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్ వీక్షించవచ్చు.

‘మిస్టర్ పెళ్లాం’ డెయిలీ సిరీస్ భవ్య (పూజా మూర్తి), నివాస్ (అమర్ దీప్), రేఖ (సోనియా) అనే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ. పెళ్లి కోసం కలలు కంటూ తనను తనలాగా ప్రేమించే భర్త కోసం భవ్య క‌ల‌లు కంటుంటుంది. నివాస్ ధ‌న‌వంతురాలిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలనుకుంటాడు. భవ్య దగ్గర పని చేసే రేఖ డబ్బులను ప‌ట్టించుకోకుండా అప‌రిమిత‌మైన ప్రేమ చూపించే వ్య‌క్తి కావాల‌ని కోరుకుంటుంది. వీరు ముగ్గురు ఒక‌టి త‌లిస్తే విధి మ‌రోలా త‌లిచింది. విధి ఆడిన నాట‌కంలోని ట్విస్టుల‌తో ముగ్గురు ఒక‌రితో ఒక‌రు ముడిప‌డ‌తారు. భ‌వ్య‌, రేఖ నిజంగానే వారు కోరుకుట‌న్న‌ట్లు నిజ‌మైన ప్రేమ‌ను పొందుతారా? వీరి ప్ర‌యాణాన్ని వీక్షించాల‌నుకుంటే ఆహాకు ట్యూన్ కావాల్సిందే. కార్తీక దీపం సీరియ‌ల్‌ను రూపొందించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్న గ‌గ‌న్ టెలీ షో ఇప్పుడు మిస్ట‌ర్ పెళ్లాంను నిర్మిస్తుంది. భవ్య‌, నివాస్‌, రేఖల ఆస‌క్తిక‌ర‌మైన ప్రేమ క‌థ‌ను న‌వంబ‌ర్ 28 నుంచి సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఫ్రీగా ఆహాలో ఉచితంగా చూడ‌వ‌చ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సంద‌ర్భంగా ఆహా సీఈఒ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు ఆహా నుంచి వ‌చ్చిన ఒరిజిన‌ల్స్‌, షోస్, సిరీస్ ఇలా అన్నీ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌నే మా ఆడియెన్స్‌కు అందించాయి. ఈ క్ర‌మంలో మేం స‌రిహద్దుల‌ను మ‌రింత‌గా విస్త‌రించాల‌ని అనుకుంటున్నాం. డెయిలీ సిరీస్‌లను ఇష్టపడి ఆదరించే మహిళల కోసం అది కూడా ఓ సింగిల్ డౌన్ లోడ్ క‌న్వినెన్స్‌తో ఓ సిరీస్‌ను అందిస్తున్నాం. ఆహాలో ప్రతీ యూజర్ మాకెంతో ప్రత్యేకం. అందుక‌ని వారిని మా ఓటీటీలో మ‌రింత‌గా నిమ‌గ్న‌మ‌య్యేలా చేయటానికి ఇంకా బెస్ట్ కంటెంట్‌ను అందించ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. డెయిల్ సిరీస్‌లను ఇష్ట‌ప‌డే మ‌హిళ‌ల కోసం సిరీస్‌ను మిస్ట‌ర్ పెళ్లాం సిరీస్‌ను సిద్ధం చేశాం. దీంతో వ‌న్ స్టాప్ షాప్ ఎంట‌ర్‌టైన్మెంట్‌గా ఆహా స్థానాన్ని తీసుకెళ్లే మహిళల కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు.

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే