AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iravatham Movie: ఓటీటీలో అదరగొడుతోన్న ఐరావతం.. థ్రిల్లర్‌ మూవీకి ఫిదా అవుతోన్న ప్రేక్షకులు..

ఇటీవల సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ మూవీస్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది 'ఐరావతం' చిత్రం. సస్పెన్స్, థ్రిల్లర్‌ జోనర్‌తో తెరకెక్కిన..

Iravatham Movie: ఓటీటీలో అదరగొడుతోన్న ఐరావతం.. థ్రిల్లర్‌ మూవీకి ఫిదా అవుతోన్న ప్రేక్షకులు..
Iravatham Movie
Narender Vaitla
|

Updated on: Nov 30, 2022 | 8:50 AM

Share

ఇటీవల సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ మూవీస్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘ఐరావతం’ చిత్రం. సస్పెన్స్, థ్రిల్లర్‌ జోనర్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్తేర్ నోహ, అమర్ దీప్, తన్వీ నేగి, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి సుహాస్ దర్శకత్వం వహించారు.

నవంబర్‌ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ ఆకట్టుకుంటోంది. ఐరావతం మూవీకి అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి స్థానంలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఎస్తేర్ నొర్హానా, అమీర్ దీప్ పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తుందని తెలిపిన చిత్ర యూనిట్‌, వైట్ కెమెరా నేపథ్యంగా సాగే కథ మంచి ఎంగేజింగ్‌గా ఉందని తెలిపారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఐరావతం కథను దర్శకుడు సుహాస్ చెబితే మాకు బాగా నచ్చింది. ఈ కథలోని స్క్రీన్ ప్లే నచ్చి మూవీ తీద్దాం అనుకున్నాం. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్‌కు నచ్చి తీసుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యాం. గత రెండు వారాలుగా టాప్ ప్లేస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సైకో కిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. వైట్‌ కెమెరా చుట్టూ కథను అల్లిన తీరు ఆకట్టుకుంటోంది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హిట్‌ టాక్‌తో ఓటీటీలో దుమ్మురేపుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!