Senapathi Review: ఊహించని మలుపులతో సేనాపతి.. రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం.. రివ్యూ..

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్‏లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.

Senapathi Review: ఊహించని మలుపులతో సేనాపతి.. రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం.. రివ్యూ..
Senapathi

సినిమా: సేనాపతి నటీనటులు: రాజేంద్రప్రసాద్, రేష్ అగస్త్య, రాకెండు మౌళి, జ్ఞానేశ్వరీ కండ్రేగుల, సత్య ప్రకాష్, జీవన్ కుమార్, తదితరులు. డైరెక్టర్: పవన్ సాధినేని నిర్మాత : విష్ము ప్రసాద్, సుష్మిత కొణిదెల సినిమాట్రోగ్రఫీ: వివేక్ కాలెపు ఎడిటర్: గౌతం నెరుసు మ్యూజిక్ డైరెక్టర్: శ్రవణ్ భరద్వాజ్

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్‏లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. అంతేకాకుండా టాక్ షో, గేమ్ షో, కుకింగ్ షోస్ నిర్వహిస్తూ డిజిటల్ ప్లాట్ పాంలో దూసుకుపోతుంది ఆహా. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సేనాపతి టైటిల్‏తో తీసుకువచ్చింది. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించగా.. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాతో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రాజేంద్రప్రసాద్ కాకుండా.. న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ చేయడం జరిగింది.

కథ.. కృష్ణ (నరేష్ అగస్త్య) ఓ అనాథ, చేయని నేరానికి బాల నేరస్థుల గృహానికి వెళ్తాడు. అక్కడ వార్డెన్ (చిన్ని కృష్ణ) ప్రోత్సాహంతో చదువుకుని పోలీస్ అవుతాడు. ఐపీఎస్ కావాలనేది అతని లక్ష్యం. అయితే ఓసారి క్రిమినల్‏ను వెంటాడుతున్న సమయంలో సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకుంటాడు. ఇక అలాంటి సర్వీస్ రివాల్వర్స్ చీకటి సామ్రాజ్యంలో ఎలా చేతులు మారతాయి. ? వాటితో ఎలాంటి పనులు చేస్తారు ? సామాన్యుల చేతిలోకి వెళ్లిపోతే తీసుకోవడం ఎంత కష్టం ? చెప్పడమే కాకుండా.. బ్లాక్ మార్కెట్‏లో సర్వీస్ రివాల్వర్ కొన్న కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) ఈ సర్వీ్స్ రివాల్వర్‏ను ఎక్కడ, ఎందుకు ఉపయోగించాడు..కృష్ణమూర్తి సేనాపతిగా ఎందుకు మారాడు అనేది కథ.

దర్శకత్వం.. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీని తెరకెక్కించిన పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందించడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. థ్రిల్లర్ మూవీని డీల్ చేయడంలో పవన్ తనను తాను నిరూపించుకున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో తన నటనతో మరోసారి అదరగొట్టాడు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా ఎప్పుడూ ఏదో పొగొట్టుకునే వాడిగా నరేశ్ అగస్త్య తన పాత్రలో జీవించేశాడనే చెప్పుకోవాలి. ఇక ఇందులో నటించిన రాకేందు మౌళి, హర్షవర్థన్, ‘జోష్’ రవి తమ పాత్రలలో జీవించారు. ప్రతి మనిషిలోనూ ఓ గ్రే షేడ్ ఉంటుందని.. అది ఎప్పుడు ఎలా బయటపడుతుందో చెప్పలేమని ఈ సినిమా ద్వారా నిరూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. వ్యవస్థను మాత్రమే నమ్ముకున్న వ్యక్తులు సైతం ఒకానొక సమయంలో తమ వ్యవస్థపై తిరుగుబాటు చేసే ఆస్కారం లేకపోలేదని రాజేంద్రప్రసాద్ తన పాత్ర ద్వారా నిరూపించాడు. కృష్ణమూర్తి పాత్రను చక్కగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ పవన్ విజయం సాధించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో సత్య ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం.. సాంకేతిక నిపుణులు సేనాపతి స్క్రీన్ ప్లే విషయంలో తమ ప్రతిభను కనబరిచారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్‏గా నిలిచింది. ఇక వివేక్ కాలెపు సినిమాటోగ్రఫీ మూవీ మూడ్‏ను సరిగ్గా క్యారీ చేశాయి. ఈసినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటన మాత్రమే కాకుండా మాటలు రాసి ప్రేక్షకులను మెప్పించాడు రాకేందు మౌళి. ఇక గౌతమ్ నెరుసు ఎడిటింగ్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సినిమాతో ప్రేమ కథలు మాత్రమే కాదు.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను కూడా తెరకెక్కించడంలోనూ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ పవన్ సాధినేని. సేనాపతి సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించే చిత్రమని చెప్పుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్.. రాజేంద్రప్రసాద్ నటన పవన్ సాధినేని దర్శకత్వం వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ నేపథ్య సంగీతం.

Also Read:Vishwak Sen: కరోనా భారిన పడ్డ పాగల్ హీరో.. క్యారంటైన్‏లో ఉన్నానంటూ ట్వీట్ చేసిన విశ్వక్ సేన్..

Samantha: అలాంటి పాత్రలు చేసి అలసిపోయాను.. వాళ్లే ఆ ఆలోచన మార్చారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Ilayaraja: వీడియోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన ఇళయరాజా.. పాటతో న్యూఇయర్ జోష్ నింపిన మ్యాజిక్ మేస్ట్రో..

RRR : ఆర్ఆర్ఆర్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన జక్కన్న..

Published On - 4:59 pm, Fri, 31 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu