AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: ఓటీటీలోకి వచ్చేసిన నాని బ్లాక్ బస్టర్ సినిమా.. హిట్ 3 మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే హిట్ 3 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Actor Nani: ఓటీటీలోకి వచ్చేసిన నాని బ్లాక్ బస్టర్ సినిమా.. హిట్ 3 మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
Hit 3 Movie
Rajitha Chanti
|

Updated on: May 29, 2025 | 9:18 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో యూత్, ఫ్యామిలీ అడియన్స్ ఎక్కువగా అభిమానించే హీరోలలో నాని ఒకరు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ సహజ నటనతో ప్రజల మదిని గెలుచుకున్నారు. కానీ కొన్నాళ్లుగా రూట్ మార్చిన నాని.. ఇప్పుడు విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు నాని. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపాడు నాని. అర్జున్ సర్కార్ పోలీస్ ఆఫీసర్ గా సత్తా చాటారు. ఈ సినిమాతో అటు మాస్ హీరోగానూ మరింత ఫాలోయిగ్ పెంచుకున్నాడు. ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మే 29 నుంచి హిట్ 3 మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలోకి ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. 4K డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ సినిమా అభిమానులకు మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో బీభత్సమైన వయోలెన్స్ తో నాని బాక్సాఫీస్ షేక్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

కథ విషయానికి వస్తే.. అర్జున్ సర్కార్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. సొసైటీలో క్రిమినల్ అనేవాడు కనిపించకూడదు అనేది అతడి సిద్ధాంతం. విపరీతమైన కోపం ఉన్న అర్జున్.. క్రిమినల్స్ కు నరకం చూపిస్తుంటారు. అయితే కొందరు సీరియల్ కిల్లర్స్ అమాయకమైన ప్రజల ప్రాణాలను భయంకరంగా తీస్తుంటారు. దేశంలో ఒకే పద్దతిలో జరిగిన 13 హత్యల వెనక ఉన్న మిస్టరీ ఏంటీ.. ? ఈ హత్యలు చేసిన సీరియల్ కిల్లర్స్ ఎవరు ? సీటీకే అనే డార్క్ వెబ్ సైట్ వెనకున్న వ్యక్తిని అర్జున్ సర్కార్ కనిపెట్టాడా ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..