AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia Deshmukh: నీ రెక్కలను కాలేను కానీ.. ఇన్‌స్టాలో జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌..

'బొమ్మరిల్లు' సినిమాలోని 'హాసినీ' పాత్రతో మన పక్కింటి అమ్మాయిలా మారిపోయింది జెనీలియా డిసౌజా. తన అందం, అభినయంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను మనువాడి..

Genelia Deshmukh: నీ రెక్కలను కాలేను కానీ.. ఇన్‌స్టాలో జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌..
Basha Shek
|

Updated on: Nov 28, 2021 | 2:39 PM

Share

‘బొమ్మరిల్లు’ సినిమాలోని ‘హాసినీ’ పాత్రతో మన పక్కింటి అమ్మాయిలా మారిపోయింది జెనీలియా డిసౌజా. తన అందం, అభినయంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను మనువాడి, ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. వివాహం తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించకపోయినా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, జిమ్‌ వర్కవుట్ల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. అదేవిధంగా జెన్నీ నెట్టింట్లో షేర్‌ చేసే తన ఇద్దరి బిడ్డల ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార. అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తోన్న ఈ పోస్ట్‌ వైరలవ్వడమే కాకుండా అందరి హృదయాలను హత్తుకుంటోంది.

నీకు మాటిస్తున్నా.. ‘డియర్‌ రియాన్‌.. నీ పుట్టినరోజు సందర్భంగా ఒక మాటిస్తున్నాను. నీ చిట్టి బుర్రలో ఉన్న ఎన్నో కోరికలు, ఆశలను కచ్చితంగా నిజం చేస్తాను. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కలను కాలేను కానీ.. ఆ రెక్కల కింద గాలినవుతాను. అన్ని విషయాల్లోనూ నువ్వు మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకోను. కానీ చివరి స్థానంలో ఉన్నా నీవెంటో, నీ ప్రత్యేకతలేంటో నేను గుర్తిస్తాను. నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌. ఐ లవ్‌ యూ మై బ్రేవ్‌ బాయ్‌’ అంటూ తన ముద్దుల తనయుడిపై ప్రేమను కురిపించింది జెనీలియా. అభిషేక్‌ బచ్చన్‌, సంజయకపూర్‌ లాంటి సెలబ్రిటీలు ఈ పోస్టుపై స్పందించారు. రియాన్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ లైకుల వర్షం కురిపించారు.

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

Also Read:

Akhanda Pre Release Event photos: అఖండ మొదటి గర్జనలో సందడి చేసిన పుష్పరాజ్ , బాలయ్య..(ఫొటోస్)

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Akhanda Pre Release Event Highlights: బోయపాటి బాలయ్య గర్జనలో భాగంగా.. అఖండ ప్రీ రిలీజ్ హైలైట్స్..(వీడియో)