Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. దేవర నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

పక్కా ప్లానింగ్‌తో, భారీ స్టారింగ్ ఉండేలా చూసుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఇందులో భాగంగానే దేవర సినిమాలో జాన్వీ కపూర్తో పాటు సైల్‌ అలీ ఖాన్‌ వంటి భారీ స్టార్‌డమ్‌ను సెట్‌ చేశారు. పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ స్థాయిలో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌ అభిమానులకు...

NTR: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. దేవర నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..
Devara
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 01, 2024 | 12:04 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపులార్‌ వంటి భారీ విజయం తర్వాత యంగ్‌ టైగర్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఊహకందని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆచార్యతో తొలిసారి కెరీర్‌లో తొలి అపజయాన్ని ఎదుర్కొన్న కొరటాల శివ, కచ్చితంగా సాలిడ్‌ విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నారు. అందుకే ఈ దేవర చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

పక్కా ప్లానింగ్‌తో, భారీ స్టారింగ్ ఉండేలా చూసుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఇందులో భాగంగానే దేవర సినిమాలో జాన్వీ కపూర్తో పాటు సైల్‌ అలీ ఖాన్‌ వంటి భారీ స్టార్‌డమ్‌ను సెట్‌ చేశారు. పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ స్థాయిలో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. దేవర సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను అందించింది.

దేవర చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను జనవరి 8వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీకి సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను చిత్రయూనిట్ పంచుకుంది. సముద్రం మధ్యలో జూనియర్‌ పడవపై ఉన్న ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతూ, దేవర గ్లింప్స్‌ను చూడడానికి ఎంతో ఆతృతతో ఉన్నాను అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ 8వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ ట్వీట్..

ఇదిలా ఉంటే.. దేవర చిత్రంలో ఎన్టీఆర్‌ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న తెలుస్తోంది. తండ్రీకొడుకుల పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో సైఫ్‌కు జోడిగా చైత్ర రాయ్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అనిరుధ్‌ సంగీతం వహిస్తున్న ఈ సినిమాను కేవలం భారత్‌లోనే కాకుండా జపనీస్, చైనీస్‌తో కలిపి మొత్తం 9 భాషల్లో విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..