చడిచప్పుడు లేని నాగ్ సినిమా.. షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకున్న ‘వైల్డ్ డాగ్’.. అప్డేట్ ఏది ?
లాక్ డౌన్ అనంతరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే జోష్‌తో మిగిలిన సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి.

లాక్ డౌన్ అనంతరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే జోష్‌తో మిగిలిన సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ హీరోల నుంచి.. యంగ్ హీరోల వరకు అందరూ తమ సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తూ.. అభిమానులకు స్వీట్ న్యూస్ అందిస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ తమ సినిమా విడుదల తేదీలను ప్రకటించగా… మరో హీరో బాలకృష్ణ తన మూవీ డేట్‌ను ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ సీనియర్ హీరో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నాడు.
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది కూడా. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. గతంలో ఈ సినిమాను ఓటీటీ వేదిక నెట్‌ఫిక్స్‌లో విడుదల చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు అటు ఓటీటీలో కూడా విడుదల కాలేదు. అయితే ఈ సినిమా గురించి అటు నాగ్ కానీ.. ఇటు చిత్రయూనిట్ కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వడం లేదు. ఇక ఈ మూవీ తర్వాత నాగార్జున, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో బంగార్రాజు సినిమా చేయనున్నట్లుగా గతంలో ప్రకటించారు. అటు ఈ సినిమాకు గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. మరీ నాగార్జున కూడా సమ్మర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? లేవా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read:
Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా




