Nithiin Rang De movie: కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగింది. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే పలు చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో నితిన్ నటిస్తోన్న రంగ్‌దేకు కూడా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ కాస్ట్‌కి 20శాతం కలిపి ఆ ఓటీటీ ‘రంగ్‌దే’కి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై నితిన్ టీమ్ మాత్రం ఇంకా స్పందించనున్నట్లు టాక్.
కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీపై బాగా నమ్మకం ఉన్న దర్శకనిర్మాతలు థియేటర్లలోనే రంగ్‌దేను విడుదల చేయాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదల అంటూ ఆ మధ్యన విడుదలైన టీజర్‌లో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఆ ఓటీటీ ఇచ్చిన ఆఫర్‌కి రంగ్‌దే టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Read More:
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు