రూ.1.1కోట్లు కట్టండి.. ఆ‌ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన నిశ్శబ్దం ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే

  • Tv9 Telugu
  • Publish Date - 2:09 pm, Wed, 7 October 20
రూ.1.1కోట్లు కట్టండి.. ఆ‌ ఛానెల్‌కి 'నిశ్శబ్దం' టీమ్‌ నోటీసులు

Local Channel Nishabdham: అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన నిశ్శబ్దం ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. హారర్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. టాక్‌ని పక్కనపెడితే ఇప్పటికీ నిశ్శబ్దం టీమ్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ లోకల్‌ ఛానెల్‌ నుంచి నిశ్శబ్దం టీమ్‌కి షాక్ తగిలింది. అదేంటంటే నిశ్శబ్దంను త్వరలో తమ ఛానెల్‌లో ప్రసారం చేస్తామని ఆ ఛానెల్‌ ఓ ప్రకటనను ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన నిశ్శబ్దం టీమ్‌ రంగంలోకి దిగింది. నష్ట పరిహారంగా రూ.1.1కోట్లు కట్టాలని ఆ ఛానెల్‌ని ఆదేశించింది. అయితే టీమ్‌ ఒక్కటే కాదు హక్కులను పొందిన అమెజాన్ సైతం తమకు అదనంగా రూ.30లక్షలు చెల్లించాలని నోటీసులు పంపింది. ఇక ఈ విషయాన్ని ఓ వెబ్‌సైట్‌ రాయగా.. దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ తన సోషల్ మీడియాలో రీట్వీట్ చేశారు.

అయితే ఈ మధ్యకాలంలో సత్యదేవ్‌ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాకు సైతం ఇలాంటి షాక్ తగిలింది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానెల్‌ కొనుగోలు చేయగా.. అందులో ప్రదర్శితం అవ్వకుండానే ఓ లోకల్‌ ఛానెల్ వాళ్లు దాన్ని ప్రసారం చేశారు. అయితే శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులపై లోకల్ ఛానెల్స్ వారికి సరైన అవగాహన లేకనే ఇలా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. వారికి ఈ హక్కుల గురించి ఇప్పటికైనా చెప్పడం మంచిదని సూచిస్తున్నారు.

Read More:

మళ్లీ ఆసుపత్రిలో చేరిన నటుడు విజయ్‌కాంత్‌

ట్రక్కును పేల్చిన ఉగ్రవాదులు.. 19 మంది మృతి