చెప్పు తెగుద్ది అంటూ.. ‘ఆది’కి నెటిజన్ల వార్నింగ్..!

జబర్దస్త్‌లో.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుపుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అతని స్కిట్ వస్తున్నంత సేపూ.. జడ్జిలతో పాటు.. ప్రేక్షకులు కూడా కడుపుబ్బా నవ్వుతూ.. ఉంటారు. ఛానెల్‌ను మార్చకుండా.. చూస్తూంటారు. అయితే.. గురువారం ప్రసారమైన జబర్దస్త్‌లో.. ఆది.. సుధీర్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. దీంతో.. నెటిజన్స్‌ ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్నింగ్స్ […]

చెప్పు తెగుద్ది అంటూ.. 'ఆది'కి నెటిజన్ల వార్నింగ్..!

జబర్దస్త్‌లో.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుపుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అతని స్కిట్ వస్తున్నంత సేపూ.. జడ్జిలతో పాటు.. ప్రేక్షకులు కూడా కడుపుబ్బా నవ్వుతూ.. ఉంటారు. ఛానెల్‌ను మార్చకుండా.. చూస్తూంటారు. అయితే.. గురువారం ప్రసారమైన జబర్దస్త్‌లో.. ఆది.. సుధీర్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. దీంతో.. నెటిజన్స్‌ ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్నింగ్స్ ఇస్తున్నారు.

స్కిట్‌లో భాగంగా.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వాదించుకుంటూ.. ఉంటారు. ఈ క్రమంలో సుధీర్.. నా గురించి నీకు సరిగా తెలియదు.. అంటారు. దాంతో.. ఆది హే.. నీ గురించి నాకు తెలియకపోవడమేంటి..? నీ ఫోన్‌లో మొత్తం ఫోన్‌ నంబర్లు 63,73,99,000 లక్షల నెంబర్లు ఉంటాయి కదా అంటాడు.. దానికి సుధీర్.. నీకు అంత కరెక్ట్‌‌గా ఎలా తెలుసు అంటాడు. ఎందుకంటే.. మన దేశంలో మొత్తం ఆడాళ్ల సంఖ్య అదే కాబట్టి.. అంటూ.. పంచ్ వేస్తాడు ఆది. ఆ వ్యాఖ్యలకు అటు యాంకర్ అనసూయతో పాటు.. జడ్జిలు కూడా.. ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వారు.

ఇప్పుడు ఈ కామెంట్స్ నెటిజన్స్‌కి ఆగ్రహం తెప్పించాయి. మనదేశంలో మొత్తం ఆడాళ్ల సంఖ్య ఏమిటి..? అందులో నీ చెల్లి, తల్లి కూడా ఉన్నారు కదా.. అంటూ సోషల్ మీడియాలో.. అసభ్యకరమైన పద జాలంతో ఆదిని దూషిస్తున్నారు నెటిజన్లు. ఇదివరకే.. జడ్జి రోజాపై కూడా.. కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అది మరువక ముందే మళ్లీ కామెంట్స్‌తో వార్తల్లో కెక్కాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu