చీలిపోయిన అల్లు అరవింద్ ఫ్యామిలీ!

చీలిపోయిన అల్లు అరవింద్ ఫ్యామిలీ!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. ఇటీవల తన ఆస్తులు పంపంకం చేయడం పెద్ద సంచలనంగా మారింది. అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లకు సమానంగా ఆస్తిని పంచారు. ఒకప్పుడు వేగంగా సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్.. ఇప్పుడు కాస్త నెమ్మదించారు. అధిక సమయం తన తనయుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇటీవల 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇదే సరైన తరుణం అని భావించి అన్ని పనులు […]

Ravi Kiran

| Edited By: Anil kumar poka

Oct 15, 2019 | 3:44 PM

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్.. ఇటీవల తన ఆస్తులు పంపంకం చేయడం పెద్ద సంచలనంగా మారింది. అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లకు సమానంగా ఆస్తిని పంచారు. ఒకప్పుడు వేగంగా సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్.. ఇప్పుడు కాస్త నెమ్మదించారు. అధిక సమయం తన తనయుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. ఇటీవల 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇదే సరైన తరుణం అని భావించి అన్ని పనులు తన కొడుకులకు అప్పగించాలని భావిస్తున్నారట.

ఇందులో భాగంగా ఆస్తి పంపకాలు జరిగాయట. అల్లు ఫ్యామిలీకి తలమానికంగా ఉన్న గీతా ఆర్ట్స్ సంస్థ అరవింద్ పెద్ద కొడుకు బాబీ చేతుల్లోకి వెళ్లినట్లు టాక్. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. దీనికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ త్వరలోనే సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా అల్లు అరవింద్ ఫ్యామిలీలో ఆస్తి పంపకాల వ్యవహారం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రాఫిట్‌స్ను పెద్ద కొడుకు వెంకటేష్, అరవింద్ సోదరి వసంతలు షేర్ చేసుకోనుండగా.. మూడో కొడుకు అల్లు శిరీష్‌కు కూడా కొంత భాగం దక్కనుందని వినికిడి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu