నీ కన్ను నీలి సముద్రం@ 50 మిలియన్లు..!

నీ కన్ను నీలి సముద్రం@ 50 మిలియన్లు..!

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కరోనా లేకపోయి ఉంటే గత నెలలోనే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2020 | 8:12 PM

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ఉప్పెన. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కరోనా లేకపోయి ఉంటే గత నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా.. ఆ రెండు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. మొదటి పాట నీ కన్ను నీలి సముద్రం 50 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. మరోవైపు ధక్‌ ధక్‌ ధక్‌ పాటకు 12 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ రెండు పాటలకు దేవీ అందించిన సంగీతానికి తోడు చంద్రబోస్‌, శ్రీమణి అందించిన లిరిక్స్‌ అద్భుతంగా ఉండటంతో.. మొదటి నుంచే పాటలకు క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఈ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత మూడో పాట విడుదలవుతుందని దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read This Story Also: జగన్‌పై అసభ్యకర పోస్ట్‌లు.. ఏపీ పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu