అక్షయ్​ ‘గే’ అని..అత‌డి భార్య‌కు చెప్పింది ఎవ‌రంటే..

అక్షయ్​ 'గే' అని..అత‌డి భార్య‌కు చెప్పింది ఎవ‌రంటే..

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​కుమార్.. గే అని అతడి భార్య ట్వింకిల్​ ఖన్నాకు ఆమె తల్లి డింపుల్ కపాడియా చెప్పిందంటే మీరు న‌మ్ముతారా. అవును ఇది నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్వింకిల్ ఖ‌న్నానే బ‌య‌ట‌కు వెల్ల‌డిం‌చింది. వీరిద్దరి పెళ్లి ప్రస్తావన గురించి చర్చ వచ్చిన‌ప్పుడు డింపుల్ ఈ విషయాన్ని చెప్పిన‌ట్టు ట్వింకిల్​ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ​ “నేను, అక్షయ్​.. మా పెళ్లి గురించి మా అమ్మ దగ్గర ప్రస్తావించాము. అక్షయ్​ వెళ్లిన […]

Ram Naramaneni

|

May 11, 2020 | 7:22 PM

బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​కుమార్.. గే అని అతడి భార్య ట్వింకిల్​ ఖన్నాకు ఆమె తల్లి డింపుల్ కపాడియా చెప్పిందంటే మీరు న‌మ్ముతారా. అవును ఇది నిజం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్వింకిల్ ఖ‌న్నానే బ‌య‌ట‌కు వెల్ల‌డిం‌చింది. వీరిద్దరి పెళ్లి ప్రస్తావన గురించి చర్చ వచ్చిన‌ప్పుడు డింపుల్ ఈ విషయాన్ని చెప్పిన‌ట్టు ట్వింకిల్​ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ​

“నేను, అక్షయ్​.. మా పెళ్లి గురించి మా అమ్మ దగ్గర ప్రస్తావించాము. అక్షయ్​ వెళ్లిన తర్వాత నాకు ఓ మాట చెప్పాలని మా అమ్మ అంది. కానీ, నేను వెంట‌నే చెప్ప‌మ‌ని మారాం చెయ్య‌గా.. అక్షయ్​ గే అని ఆమె ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్పింది. ఆ మాటతో నాకు మూర్ఛపోయినంత పనైంది” అని ట్వింకిల్​ ఖన్నా పేర్కొంది.

ఆ తర్వాత ట్వింకిల్​ తల్లి.. వీరిద్దరూ ఒక ఏడాదిపాటు డేటింగ్ చేయాలన్న కండీష‌న్ పెట్టింది. అలా సహజీవనం చేసిన సంవత్సరం తర్వాత 2001లో వారిద్దరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా అక్షయ్​, ట్వింకిల్​ పిల్లలతో విలువైన‌ సమయాన్ని గడుపుతున్నారు. ​

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu