Nayanthara : వామ్మో.. పెద్ద ప్లానింగే.. నయన్ మాటలకు అనిల్ రావిపూడి షాక్.. ఇదెక్కడి ప్రమోషన్స్ సామీ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా నిర్వహిస్తున్నారు డైరెక్టర్ అనిల్. ఈసారి సైతం మరింత కొత్తగా ప్రమోషన్స్ చేశారు.

సంక్రాంతికి తెలుగులో సినిమాల జాతర సాగనుంది. ఈ ఏడాది పండక్కి విడుదల కానున్న చిత్రాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలోచిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. నిజానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా, విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వీడియోస్ షేర్ చేస్తున్నారు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తూన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
ఇదెలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పటిలాగే సరికొత్తగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ మొదటి నుంచి ఎప్పుడూ ఏదోక ఆసక్తికర వీడియో రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు నయనతారతో కలిసి క్రేజీ వీడియో షేర్ చేశారు. ఎప్పుడూ ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్.. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు మాత్రం మొదటి నుంచి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
తాజాగా విడుదలైన వీడియోలో స్వయంగా నయనతార వచ్చి డైరెక్టర్ అనిల్ రావిపూడితో మాట్లాడుతుంది. సినిమా మొదట్లో ఒక ప్రమోషనల్ వీడియో చేశా. మరి ఇప్పుడు ఏం లేదా అని అడగడంతో అనిల్ రావిపూడి షాకై పడిపోతుండడంతో అసిస్టెంట్స్ పట్టుకుంటారు. వెంటనే తేరుకుని మీరు అడగడమే పెద్ద ప్రమోషన్స్.. మీరు జస్ట్ జనవరి 12 రిలీజ్ అని చెప్పండి మేడమ్ అని అంటారు. తర్వాత నయనతార వచ్చి హలో మాస్టార్.. ఫేస్ కొంచం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అనడంతో స్క్రీన్ లోకి అనిల్ రావిపూడి ఎంటర్ అవుతారు. ఇద్దరూ కలిసి “సంక్రాంతికి రఫ్పాడించేద్ధాం” అని చెప్పడంతో సినిమా రిలీజ్ డేట్ స్క్రీన్ పై చూపిస్తారు.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
