AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘‘ఇది సినిమానా’’ అంటూ సమంత మూవీపై సినిమాటోగ్రాఫర్ కామెంట్

విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం షాకింగ్ కామెంట్లు చేశారు. ‘‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా..? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్ డీలక్స్’ ఇది సినిమానా.. ఓ […]

‘‘ఇది సినిమానా’’ అంటూ సమంత మూవీపై సినిమాటోగ్రాఫర్ కామెంట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 6:11 PM

Share

విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం షాకింగ్ కామెంట్లు చేశారు.

‘‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా..? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. ‘సూపర్ డీలక్స్’ ఇది సినిమానా.. ఓ గాడ్.. అసలు భరించలేకపోయా’’ అంటూ నటరాజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా నచ్చకపోయినంత మాత్రన ఇలా నీచంగా కామెంట్ చేయకూడదు అంటూ పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే శృంగారం, లింగ వివక్షత వంటి అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.