టాప్‌ దర్శకుడి నిర్మాణంలో.. ఇంతవరకు కనిపించని రోల్‌లో..!

లాక్‌డౌన్‌లో ఓ వైపు కుటుంబానికి సమాయాన్ని కేటాయిస్తూనే.. మరోవైపు తన తదుపరి సినిమాల గురించిన పక్కా ప్లాన్‌లు వేసుకుంటున్నారు నాచురల్ స్టార్ నాని.

  • Tv9 Telugu
  • Publish Date - 2:28 pm, Thu, 21 May 20
టాప్‌ దర్శకుడి నిర్మాణంలో.. ఇంతవరకు కనిపించని రోల్‌లో..!

లాక్‌డౌన్‌లో ఓ వైపు కుటుంబానికి సమాయాన్ని కేటాయిస్తూనే.. మరోవైపు తన తదుపరి సినిమాల గురించిన పక్కా ప్లాన్‌లు వేసుకుంటున్నారు నాచురల్ స్టార్ నాని. ఈ క్రమంలో మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన వి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీష్‌లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగ రాయ్’‌లో నాని నటించబోతున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం నాని మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రీకాంత్, ఇటీవల నానికి ఒక కథ చెప్పారట. ఈ కథ నానికి బాగా నచ్చిందట. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో నటించేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇక ఈ మూవీలో నాని ఇంతవరకు నటించని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాధారణంగా తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్‌లు దర్శకులుగా మారే సమయంలో లెక్కల మాస్టర్ సుకుమార్ వారికి తన సపోర్ట్‌ ఇస్తూ వస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని, శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాను శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్‌తో కలిసి సుకుమార్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి మధ్యలోనే సినిమాల షూటింగ్‌లు ఆగిపోగా.. త్వరలోనే టాలీవుడ్‌లో చిత్రీకరణలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. దీని గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, కొరటాల తదితరులు సమావేశమై చర్చించారు.

Read This Story Also: ఇట్స్‌ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా