AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇట్స్‌ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా

'నా ప్రేమను ఆమె ఓకే చేసిందని' సోషల్ మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టాలీవుడ్ హీరో రానా.. ఇప్పుడు తన పెళ్లి వార్తను కూడా అఫియల్‌గా ప్రకటించాడు. హీరో రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో..

ఇట్స్‌ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 1:33 PM

Share

‘నా ప్రేమను ఆమె ఓకే చేసిందని’ సోషల్ మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టాలీవుడ్ హీరో రానా.. ఇప్పుడు తన పెళ్లి వార్తను కూడా అఫియల్‌గా ప్రకటించాడు. హీరో రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ కనిపిస్తున్న మిహీకా బజాజ్‌‌, తాను కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు రానా. బుధవారం రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ కుటుంబ సభ్యులు గెట్ టూ గెదర్ అయ్యారు. రామానాయుడి స్టూడియోలో ఇరు కుటుంబాలూ సమావేశమై.. పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. అలాగే వధూవరులకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు అందించారు. కాగా వధూవరుల కుటుంబాలతో పాటు హీరో నాగచైతన్య, సమంతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. స్టూడియోలోని రామానాయుడు సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించింది దగ్గుబాటి ఫ్యామిలీ.

View this post on Instagram

And it’s official!! ????

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి