‘గ్యాంగ్‌ లీడర్’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే..!

‘గ్యాంగ్‌ లీడర్’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న(మంగళవారం) ఘనంగా జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయ్యేవరకు కూడా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అవ్వలేదు. దీంతో మూవీ యూనిట్‌తో పాటు బయ్యర్స్ కూడా కాస్త కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు ఇవాళ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది నాని గ్యాంగ్ లీడర్. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 9:32 PM

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న(మంగళవారం) ఘనంగా జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయ్యేవరకు కూడా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అవ్వలేదు. దీంతో మూవీ యూనిట్‌తో పాటు బయ్యర్స్ కూడా కాస్త కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు ఇవాళ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది నాని గ్యాంగ్ లీడర్.

ఈ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చేశారు. ఇక మూవీలో నాని యాక్టింగ్, కామెడీ టైమింగ్ అదిరిపోయిందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు టాక్. అలాగే విక్రమ్ స్క్రీన్‌ప్లే సూపర్ అని.. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా సినిమాకు మెయిన్ అస్సెట్ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఏడాది నాని ఖాతాలో మరో హిట్ పడుతుంది.

కాగా థ్రిల్లర్ కామెడీ తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్ల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రఘుబాబు, సత్య, ప్రణ్య, జైజా తదితరులు కీలక పాత్రలలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu