టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. బిగ్ స్టార్స్ మూవీలకు బ్రేక్.. ఎందుకు..?

టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. బిగ్ స్టార్స్ మూవీలకు బ్రేక్.. ఎందుకు..?

ప్రపంచ వ్యాప్తంగా కొద్ది రోజుల పాటు సాహో మానియా సందడి చేసింది. ఇక సాహో తర్వాత టాలీవుడ్‌లో బడా హీరోల సందడి మళ్లీ మొదలైంది. అయితే సాహో విడుదల కాక ముందు నుంచే.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. కాని సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, సాహో మీద నమ్మకంతో మిగిలిన సినిమా నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో వారం రోజుల పాటు పెద్ద సినిమాలకు బ్రేక్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 11, 2019 | 1:48 PM

ప్రపంచ వ్యాప్తంగా కొద్ది రోజుల పాటు సాహో మానియా సందడి చేసింది. ఇక సాహో తర్వాత టాలీవుడ్‌లో బడా హీరోల సందడి మళ్లీ మొదలైంది. అయితే సాహో విడుదల కాక ముందు నుంచే.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. కాని సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, సాహో మీద నమ్మకంతో మిగిలిన సినిమా నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో వారం రోజుల పాటు పెద్ద సినిమాలకు బ్రేక్ వచ్చి పడింది.

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ ఈనెల 13న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఐదుగురు మహిళలతో రివెంజ్ డ్రామాను నడిపించే పాయింట్ మీద దర్శకుడు విక్రమ్ కుమార్ దీన్ని రూపొందించారు. సినిమా రిలీజ్ కు రెండు రోజులే ఉంది కాని సోషల్ మీడియాలో కాని.. పబ్లిక్‌లో కాని ఈ చిత్రం పై ఎలాంటి టాక్ వినిపించడం లేదు. సినిమా ప్రమోషన్స్ కూడా జరగడం లేదు. ఓ ప్రీ రిలీజ్, ప్రెస్ మీట్‌తో సరిపెట్టారు. ట్రైలర్‌ మాత్రం కొంచెం థ్రిల్లింగ్‌గా, కొంచెం కామెడీగా ఉంది. అయితే కథ మొత్తం లేడీ టీమ్‌ చుట్టే తిరుగడం విశేషం.

ఇక మెగా ఫ్యామిలీకి చెందిన మరో బడా హీరో వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రం ద్వారా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రైలర్‌తో మంచి మాస్ మసాలా సినిమా అనే అభిప్రాయాన్ని కలిగించారు. హీరో మాత్రం ఓ గ్యాంగ్ ని మెయిన్ టెన్ చేస్తూ.. విలన్‌లా కనిపిస్తాడు. కాని అందుకు తగ్గట్టుగా పబ్లిక్‌లో టాక్ తీసుకురావడంలో చిత్ర బృందం ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. అయితే వినయ విధేయ రామ, చిత్రలహరి తర్వాత వస్తున్న మెగా హీరోల సినిమా వాల్మీకి.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా కూడా దీనికి మినహాయింపుగా లేదు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటిదాకా ప్రీ రిలీజ్‌కి సంబంధించిన వార్తలు కూడా రాలేదు. ఇలా వరుసగా ముగ్గురు హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. కాని ఓపెనింగ్ విషయంలో మాత్రం చిత్ర బృందాలు ప్రమోషన్స్ అంతగా చేయడం లేదు. ఇక ఈ సినిమాలు ఏ రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu