AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమత్రతో నా టెన్షన్ దూరం: మహేశ్ బాబు

తన భార్య నమత్ర చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తమ పిల్లల విషయంలోనే కాకుండా తన విషయంలో కూడా ఆమె చాలా కఠినంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మహర్షితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు.. తన 26వ  చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. ‘‘పిల్లల విషయంలో, నా విషయంలో నమ్రత చాలా […]

నమత్రతో నా టెన్షన్ దూరం: మహేశ్ బాబు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 12:59 PM

Share

తన భార్య నమత్ర చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. తమ పిల్లల విషయంలోనే కాకుండా తన విషయంలో కూడా ఆమె చాలా కఠినంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మహర్షితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు.. తన 26వ  చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.

‘‘పిల్లల విషయంలో, నా విషయంలో నమ్రత చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అది కచ్చితంగా మా మంచికే. ఎందుకంటే నేను పిల్లల్ని చాలా గారాబం చేస్తాను. ఆ గారాబం వారిపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆమె జాగ్రత్తపడుతుంటుంది. నా కుటుంబం వల్లనే నా ఒత్తిడి మాయమవుతుంది. సినిమాల విషయంలోనే కాదు. నాకు కంగారు కలిగించే ఏ విషయంలోనైనా నా భార్య, పిల్లలు నన్ను ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు’’ అంటూ మహేశ్ బాబు వెల్లడించాడు.

కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!