భయపెట్టేందుకు సిద్ధమవుతోన్న నాగ చైతన్య..!

భయపెట్టేందుకు సిద్ధమవుతోన్న నాగ చైతన్య..!

గతేడాది రెండు విజయాలతో మంచి జోరు మీదున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈ హీరో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటిస్తుండగా.. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత మనం ఫేమ్‌ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థ్యాంక్యు అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కబోతున్నట్లు టాక్‌. గతంలో విక్రమ్‌ తెరకెక్కించిన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 3:10 PM

గతేడాది రెండు విజయాలతో మంచి జోరు మీదున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈ హీరో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటిస్తుండగా.. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత మనం ఫేమ్‌ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థ్యాంక్యు అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కబోతున్నట్లు టాక్‌. గతంలో విక్రమ్‌ తెరకెక్కించిన ’13B’ సీక్వెల్‌గా ఈ మూవీని ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా కెరీర్‌ ప్రారంభం నుంచి ప్రేమ కథలే ఎక్కువగా ఎంచుకుంటూ వస్తున్నారు నాగ చైతన్య. మధ్యలో యాక్షన్ ఎంటర్‌టైనర్లు, థ్రిల్లర్‌లు చేసినప్పటికీ.. అవి ఈ హీరోకు పెద్దగా అచ్చు రాలేదు. అయితే నటుడిగా ప్రతి సినిమాకు తనను తాను మార్చుకుంటూ వస్తోన్న చైతూ.. అన్ని జోనర్లను టచ్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాది గ్యాంగ్ లీడర్‌తో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. అనుకున్న విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయారు విక్రమ్‌. దీంతో ఈ సారి గట్టి విజయాన్ని కొట్టాలని ఆయన భావిస్తున్నారట.

Read This Story Also: కరోనాను జయించాడు కానీ.. ప్లాస్మా థెరపీ తీసుకున్న డాక్టర్ మృతి..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu