AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో ఉండే కొత్త రూల్స్ ఇవే!

లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో సీను మార్చేందుకు.. యజమానులు రంగం సిద్ధం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక కొత్త చర్యలు తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే..

లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో ఉండే కొత్త రూల్స్ ఇవే!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 10, 2020 | 1:15 PM

Share

లాక్‌డౌన్ తర్వాత సినిమా థియేటర్లలో సీను మార్చేందుకు రంగం సిద్ధం చేశారు యజమానులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక కొత్త చర్యలు తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఓ ప్రముఖ థియేటర్లో ఈ విధానాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రెండు రోజుల కింద జంటనగరాల్లోని దాదాపు వందమంది థియేటర్ యజమానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ సమస్యలపై చర్చించుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత.. ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చేందుకు ముందే తామే వైరస్ నిరోధానికి కొన్ని చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పెద్దలని కలిసి.. ప్రత్యేకంగా తయారుచేసిన నివేదికను అందజేయనున్నారట.

సినిమా హాళ్లలో కొత్తరూల్స్ ఇవే:

– ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్నప్పుడే ఒక సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండదు. ఉదాహరణకు.. ఒకరు ఒకటో నెంబర్ సీటు బుక్ చేసుకుంటే.. రెండో నెంబర్ సీటు కనిపించదు. అలాగే ప్రభుత్వం అనుమతిస్తే గనుక.. ఒకే ఫ్యామిలీకి చెందిన కుటుంబసభ్యులకు మాత్రం సీట్లను వరుసగా కేటాయించే అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు వారు నివేదికలో పేర్కొన్నారు.

– అలాగే ప్రతీ ఆట ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్‌తో శుభ్రపరుస్తామన్నారు

– అలాగే ఒక సినిమా ముగిసిన 45 నిమిషాల తర్వాత మరో సినిమాను మొదలుపెడతారట

– కాగిత రూపంలో ఇచ్చే టికెట్లకు చెక్ పెట్టి.. క్యూఆర్‌కోడ్‌తో ఉన్న టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారట.

– అలాగే ‌టాయ్‌లెట్స్, ఫుడ్ స్టాల్స్ వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నానట్లు నివేదికలో పేర్కొన్నారు థియేటర్ల యజమానులు.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..