విజయానికి షార్ట్‌కట్‌లు అంటూ ఏవీ ఉండవు.. కష్టపడి పనిచేయాల్సిందే అంటోన్న ఈస్మార్ట్ భామ.
సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నభా నటేష్. ఈ సినిమా అనంతరం రవిబాబు దర్శకత్వం వహించిన ‘అదుగో’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ...

Nabha natesh talking about success: సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నభా నటేష్. ఈ సినిమా అనంతరం రవిబాబు దర్శకత్వం వహించిన ‘అదుగో’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ‘ఈస్మార్ట్’ శంకర్‌తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నభాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నభా నటేష్ నటించిన తాజా చిత్రం ‘సోలో బతుకే సో బెటరు’ చిత్రం ఈ నెల 25 విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా మీడియాతో ముచ్చటించింది. మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న ఈ చిన్నది విజయాన్ని తనదైన శైలిలో నిర్వచించింది. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో విజయానికి షార్ట్‌కట్‌లు అంటూ ఏవీ లేవు. కష్టపడి పనిచేసినప్పుడే విజయాన్ని అందుకోగలం. సినిమా అనేది జట్టు సమిష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. పోటీ గురించి నేనెప్పుడూ ఆలోచించను. నా బలాన్నే నమ్ముకుంటా. మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతోన్నా. ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తోన్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటా. కథ, నా పాత్రతో పాటు టాలెంట్ ఉన్న దర్శకనిర్మాతలతో పనిచేయడం కూడా ముఖ్యమని నమ్మే నేను వాటన్నింటికీ ప్రాధాన్యతను ఇస్తూ సినిమాల్ని చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.




