రకుల్ అవుట్.. నభా నటేష్ ఇన్
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. ఈ చిత్ర షూటింగ్ కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో మొదట అక్కినేని నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ప్లేస్ లో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ ను తీసుకున్నారని సమాచారం. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ను తప్పించడం […]

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. ఈ చిత్ర షూటింగ్ కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంలో మొదట అక్కినేని నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె ప్లేస్ లో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ ను తీసుకున్నారని సమాచారం.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ను తప్పించడం వెనక అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించనుందట. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు.



