OTT Movie: కొండపై మొండెం లేని తల? ఓటీటీలో మతిపోగొట్టే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఈ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ సిరీస్ కు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ ఉండడం విశేషం.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం, తమిళ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ప్రతి వారం వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను బాగానే అలరించింది. ముఖ్యంగా ఇందులో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఇక ఈ క్రైమ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే..తమిళనాడు నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. పెద్దగా కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసివేయాలని అనుకుంటారు. అప్పుడే కొండపై మొండెం లేని తల ఒకటి పోలీసులకు కనిపిస్తుంది. దీంతో పోలీసులకు చేతి నిండా పని దొరుకుతుంది. కానీ ఈ కేసులో చాలా చిక్కుముడులు ఉంటాయి. అసలు ఆ మొండెం లేని తల ఎవరిది? అతనిని ఎవరు చంపారు? మృతుడి మొండెం ఏమయ్యింది? అనే విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఇదే క్రమంలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మృతుడు వాచ్ మెకానిక్‌గా, ఏనుగు శిక్షకుడిగా, అక్రమ కార్యకలాపాలలో చిక్కుకున్న బాడీగార్డ్‌గా పనిచేశాడని తెలుస్తుంది? మరి పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారా? లేదా? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ సిరీస్ పేరు ‘కాట్టాన్’. రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ మణికందన్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, ముత్తు కుమార్, సింగం పులి, బాలాజీ, వడివేలు మురుగన్, రిష జాకబ్స్, వీజే పారు, కళైవాణి భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి ‘కాట్టాన్’ ఒక మంచి టైమ్ పాస్ అని చెప్పవచ్చు.
విజయ్ సేతుపతి కాట్టాన్ వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




