Personal Loan: శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా..? ఈ రెండు మార్గాల్లో పొందే ఛాన్స్.. చాలామందికి ఇది తెలియదు..
అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ రుణాల గురించి చాలామంది వెతుకుంటూ ఉంటారు. ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. ఇది పొందాలంటే ఖచ్చితంగా శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. ఈ రెండు లేకపోయిన పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.

బ్యాంక్ నుంచి లోన్ పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్లు అనేక కేటగిరీల లోన్లు అందుబాటులో ఉన్నాయి. హోమ్ లోన్, ప్రాపర్టీ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, మ్యారేజ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటివి చాలా ఉంటాయి. అయితే లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. సాధారణంగా 750 క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే లోన్లు వెంటనే మంజూరు అవుతాయి. అంతకంటే తక్కువగా ఉంటే లోన్లు మంజూరు కావడంలో ఆలస్యం జరుగుతుంది. మీ దరఖాస్తును, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని లోన్ మంజూరు చేసేందుకు ఆర్ధిక సంస్థలు ఎక్కువ సమయం తీసుకుంటాయి.
బ్యాంకులు ఏవేవి పరిగణలోకి తీసుకుంటాయి..?
అయితే అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఎక్కువమంది పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ లోన్ తీసుకునేందుకు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ జీతం, వ్యాపారం ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. ఉద్యోగం చేసేవారు తమ శాలరీ స్లిప్, వ్యాపారం చేసేవారు తమ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సిబిల్ స్కోర్ కూడా మెరుగ్గా ఉండాలి. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా.. లేదా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ రెండు లేకపోతే పర్సనల్ లోన్ పొందటం కష్టతరమవుతుంది. లోన్ మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు రీపేమెంట్ కెపాసిటీ, క్రెడిట్ హిస్టరీని పరిగణలోకి తీసుకుంటాయి. దీని ఆధారంగా రుణలు మంజూరు చేస్తూ ఉంటాయి. శాలరీ స్లిప్‌ను పర్సనల్ లోన్ కోసం అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు లేకపోయినా పర్సనల్ లోన్ పొందేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు విధాల్లో పొందే ఛాన్స్
సిబిల్ స్కోర్, ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా బ్యాంకింగ్ రిలేషన్, గ్యారంటర్ ద్వారా రుణం పొందవచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతాదారుడి రెగ్యూలర్ క్యాష్ ట్రాన్సాక్షన్లను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ప్రీ అప్రూర్డ్ లోన్లు మంజూరు చేస్తాయి. ఇక గ్యారంటర్‌గా ఒక వ్యక్తిని ఉంచడం వల్ల కూడా రుణం పొందవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు మీ క్రెడిట్ ప్రొపైల్ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. అయితే కొంతమంది నకిలీ లోన్ యాప్‌లను నమ్మి మోసపోతున్నారు. మీ వ్యక్తిగత వివరాలను లోన్ యాప్‌లు సేకరించి మోసానికి పాల్పడే అవకాశముంటుంది. దీంతో ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్‌నా. .కాదా అనేది తెలుసుకోండి. ఆ తర్వాతనే రుణం పొందండి.
