AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

A Beautiful Breakup : ఎ బ్యూటిఫుల్ బ్రేకప్.. ఇళయరాజా మ్యూజిక్ చాలా స్పెషల్.. థియేటర్లలోకి ఎప్పుడంటే..

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమే ఈ సినిమాకు ప్రధాన హైలెట్. తెలుగు నిర్మాతలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఆంగ్ల చిత్రం ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’. ఇందులో తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించగా.. అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

A Beautiful Breakup : ఎ బ్యూటిఫుల్ బ్రేకప్.. ఇళయరాజా మ్యూజిక్ చాలా స్పెషల్.. థియేటర్లలోకి ఎప్పుడంటే..
A Beautiful Breakup
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2026 | 4:57 PM

Share

తక్ష్, మటిల్డా హీరో,హీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ “ఎ బ్యూటిఫుల్ బ్రేకప్”. ఈ చిత్రాన్ని ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా, ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పిస్తున్నారు. పూర్తిగా ఇంగ్లీష్‌లో, గ్లోబల్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా రూపొందించిన “ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీనికి ముందుగా 12న దుబాయ్‌లో ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ విడుదల అనంతరం ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ చిత్రాన్ని పూర్తిగా ఇంగ్లీష్‌లో రూపొందించాం. మా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది సంగీతం. లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా గారు మా చిత్రానికి సంగీతం అందించడం మా అదృష్టం. సినిమాను చూసిన తర్వాత ఆయన స్వయంగా ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన అందించిన ఆర్కెస్ట్రల్ స్కోర్ సినిమాకు ఆత్మను, భావోద్వేగాలను, టైమ్‌లెస్ సినీమాటిక్ గ్రాండ్యూర్‌ను అందించింది. ఈ సినిమా హృదయంలో ఉన్న ఆలోచన చాలా మానవీయమైనది. ఓ జంట విడిపోవాలంటే తప్పనిసరిగా ద్వేషంతోనే విడిపోవాల్సిన అవసరం లేదు. సంతోషంగానూ విడిపోవచ్చు. జీవితంలో ఎక్కడో ఒకచోట మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. నా దృష్టిలో శాశ్వతమైన విడిపోవడం మరణంతోనే జరుగుతుంది. ఈ భావనతోనే మేము ఒక సరికొత్త, భావోద్వేగాలతో నిండిన హారర్ థ్రిల్లర్‌ను రూపొందించాం.” అని అన్నారు.

హీరో తక్ష్ మాట్లాడుతూ.. “ఎ బ్యూటిఫుల్ బ్రేకప్ సినిమా షూటింగ్‌లో ప్రధాన భాగం భారతదేశంలో, కర్ణాటకలోని చిక్కమగళూరు అరణ్య ప్రాంతంలో, ఓ అద్భుతమైన, ప్రశాంతమైన ఎస్టేట్‌లో జరిగింది. మబ్బులతో నిండిన ఆ సహజ వాతావరణం సినిమాకు ఒక భయానకమైనా అందమైన అనుభూతిని ఇచ్చింది. మాస్ట్రో ఇళయరాజా గారు ఈ చిత్రానికి పూర్తి సింఫనీ ఆర్కెస్ట్రాతో, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బో టై ఆర్కెస్ట్రాతో స్కోర్‌ను కంపోజ్ చేశారు. ఈ ఆర్కెస్ట్రల్ సంగీతం సినిమా యొక్క రొమాంటిక్ మరియు సూపర్‌నేచురల్ లేయర్లను అద్భుతంగా ఎలివేట్ చేసింది. అంతర్జాతీయ విజువల్ స్టాండర్డ్స్‌ను చేరుకునేందుకు యూకేలో కలర్ గ్రేడింగ్ చేసి, సినిమాకు హాలీవుడ్ స్థాయి ఫినిష్ తీసుకొచ్చాం. ఇది ఒక రెగ్యులర్ హారర్ సినిమా కాదు. ఇందులోని సూపర్‌నేచురల్ ఎలిమెంట్‌ను భయానక దెయ్యంగా కాకుండా, ఒక పవిత్రమైన ఆత్మగా చూపించాం. ఈ కథ నా సన్నిహిత మిత్రుడి జీవితంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా, కల్పనతో మేళవించి రూపొందించబడింది.” అని అన్నారు..

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
ఇళయరాజా సంగీతమే హైలెట్.. ఎ బ్యూటిఫుల్ బ్రేకప్..
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఎంతంటే..?
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
రాహుల్‌కు అవగాహన లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఇదే నిజమైన మానవత్వం,హిందూ సంప్రదాయంలో జరిగిన ముస్లింకుటుంబ పెళ్లి
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
ఏంట్రా ఈ అమ్మడు.. హీరోయిన్లకే చెమటలు పట్టించే అందం..
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
జాబ్ మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..?
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..