AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 4 కోట్లతో తీస్తే 110 కోట్లు వచ్చాయి.. థియేటర్లలో అందరినీ ఏడిపించిన సినిమా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

భారతీయ సినిమా ప్రపంచంలో మైలురాయిగా నిలిచే చిత్రాలు చాలా ఉన్నాయి. అందమైన ప్రేమకథలు, వెన్నులో వణుకు పుట్టించే భయానక హారర్ సినిమాలు, సస్పెన్స్ తో మెంటలెక్కించే మిస్టరీ చిత్రాలు అనేకం. కానీ ఒక సినిమాలోని క్లైమాక్స్ మాత్రం యావత్ దేశాన్ని కదిలించింది. ఈ మూవీ క్లైమాక్స్ చూస్తూ థియేటర్లలో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Cinema : 4 కోట్లతో తీస్తే 110 కోట్లు వచ్చాయి.. థియేటర్లలో అందరినీ ఏడిపించిన సినిమా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Sairat Movie
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2026 | 3:35 PM

Share

చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ సంచలనం సృష్టించింది. కుల వివక్షత పేరుతో జరిగే నేరాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన మూవీ అది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ తన మొదటి సినిమాలోని నటనకు జాతీయ అవార్డును అందుకుంది. 2016లో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా యూవతకు ఈ సినిమా చాలా ఫేవరెట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు సైరత్. మరాఠీలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ నాగరా్జ మంజులే దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

సైరత్ చిత్రంలో పార్శ్య పాత్రలో (ఆకాష్ తోసర్), ఆర్చి పాత్రలో (రింగు రాజు గురు) నటించారు. పార్శ్య మరాఠీ గ్రామానికి చెందిన మత్స్యకార వర్గానికి చెందిన కుర్రాడు. ఇక ఆర్చి అదే గ్రామంలోని సంపన్న రాజకీయ నాయకుడి కుమార్తె. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ వారిద్దరి ప్రేమ కారణంగా ఆ ఊర్లో అల్లర్లు జరుగుతాయి. ఇద్దరూ తమ గ్రామం నుంచి పారిపోయి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఇక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరకు తమకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పర్చుకుంటారు. వీరికి పాప జన్మిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో ఏం జరిగింది అనేది సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తూ థియేటర్లలోనే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

మరాఠీలో సైరత్ అంటే క్రూరమైన లేదా వికృత అని అర్థం. అందమైన ప్రేమపై కుల వివక్షత ఎలాంటి పరిస్థితిని తీసుకువచ్చిందనేది సినిమా. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. 2016లో విడుదలై దాదాపు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..