AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగం మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..? కేంద్రం బిగ్ అప్డేట్..

ఈపీఎఫ్‌వో అకౌంట్‌పై చాలామందికి సందేహాలు ఉంటాయి. పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూషన్ ఆగిపోతే ఇనాక్టివ్ అవుతుందా..? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ ఆగిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అసలు ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుంది? వడ్డీ నిలిచిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అనే వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

EPFO: ఉద్యోగం మానేస్తే పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుందా..? కేంద్రం బిగ్ అప్డేట్..
Epfo 5
Venkatrao Lella
|

Updated on: Feb 11, 2026 | 4:31 PM

Share

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అనేక అనుమానాలు ఉంటాయి. ఉద్యోగం మానేసిన వారితో పాటు పదవీ విరమణ చేసినవారిలో అనేక ప్రశ్నలు సర్వసాధారణంగా ఉంటాయి. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ వడ్డీ వస్తుందా..? అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పుడు తిరిగి దానిని యాక్టివ్ చేయవచ్చా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. అసలు ఈపీఎఫ్ ఖాతా ఎప్పుడు పనిచేయకుండా ఆగిపోతుంది..? ఒకవేళ ఇనాక్టివ్ అయితే మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది..? ఏయే సందర్భాల్లో పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడు పనిచేయదు..?

ఫైనల్ సెటిల్మెంట్‌కు ఎలిజిబుల్ అయిన తర్వాత మీ పీఎఫ్ ఖాతాలో మూడు సంవత్సరాలు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా లేదా మూడేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ దాఖలు చేయపోయినా ఖాతా అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. ఇక 58 సంవత్సరాల రిటైర్మెంట్ పీరియడ్ లేదా వేరే దేశానికి వెళ్లిపోవడం, లేదా ఖాతాదారుడు మరణించిన సమయంలో ఆగిపోతుంది. ఇక ఉద్యోగం వదిలేయడం లేదా కొన్ని సంవత్సరాల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోవడం వల్ల కూడా అకౌంట్ ఆటోమేటిక్‌గా పనిచేయడం ఆగిపోతుంది.

ఈపీఎఫ్ ఖాతా మాత్రమే..

అయితే కేవలం ఈపీఎఫ్ సభ్యుల ఐడీ మాత్రమే పనిచేయడం ఆగిపోతుంది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(UAN) మాత్రం జీవితాంతం యాక్టివ్‌గానే ఉంటుంది. కానీ యూఏఎన్ క్రింద ప్రతీసారి ఎంప్లాయి‌మెంట్ లింక్డ్ ఈపీఎఫ్ అకౌంట్‌ను విడిగా పరిగణిస్తారు. మూడేళ్ల పాటు నగదును ఉపసంహరించుకోకపోయినా లేదా ఎటువంటి సహకారం అందించపోయినా ఆ ఖాతా పనిచేయనిదిగా ట్యాగ్ చేయబుతుంది. దీని వల్ల మీకు కేంద్ర ప్రభుత్వం అందించే వార్షిక వడ్డీ కూడా నిలిచిపోతుంది.

రిటైర్మెంట్ తర్వాత వడ్డీ వస్తుందా..?

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి బయటకొచ్చాక ఎటువంటి నగదు చెల్లించకపోతే సభ్యుడికి 58 సంవత్సరాల నిండే వరకు వడ్డీ అందిస్తారు. 58 ఏళ్ల తర్వాత ఫైనల్ సెటిల్మెంట్‌కు అర్హత పొందిన తేదీ నుంచి మూడు సంవత్సరాల వరకు వడ్డీ కొనసాగుతోంది. ఈ మూడేళ్లల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ చేయకపోతే ఈ అకౌంట్ పనిచేయడం ఆగిపోవడం వల్ల వడ్డీ అందదు.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..?

-ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ కేవైసీ వివరాల అప్డేట్ చేసుకోవాలి

-యూఏఎన్ యాక్టివ్‌గా ఉందని మొబైల్ నెంబర్‌తో నిర్ధారించుకోవాలి

-యూఏఎన్ పోర్టల్ లేదా ప్రాంతీయ ఈపీఎఫ్‌వో కార్యాలయం ద్వారా క్లెయిమ్ సమర్పించవచ్చు

-క్లెయిమ్ ప్రాసెస్ అయ్యాక అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది.

-సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవడం లేదా క్లెయిమ్స్ దాఖలు చేయడం వల్ల అకౌంట్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు

Follow Us