నటుడిగా మారిన ఏఆర్ రెహమాన్.. ఆ సూపర్ స్టార్ సినిమాలో కీలక పాత్రలో మ్యూజిక్ డైరెక్టర్..
టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఏఆర్ రెహమాన్ ఒకరు. తన సంగీతంతో ఎంతో మంది యూత్‌ను మెస్మరైజ్ చేయడంలో ఏఆర్ రెహమాన్ దిట్ట.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఏఆర్ రెహమాన్ ఒకరు. తన సంగీతంతో ఎంతో మంది యూత్‌ను మెస్మరైజ్ చేయడంలో ఏఆర్ రెహమాన్ దిట్ట. ఎన్నో సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోసాడు. కేవలం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో హిట్ సాధించిన సినిమాలు లెక్కలేనన్ని. ఇప్పటివరకు తెరవెనుక ఉండి తన సంగీతంతో సినిమాలను నడిపించిన ఏఆర్ రెహమాన్.. తాజాగా వెండితెరపై నటించి అలరించేందుకు సిద్ధమయ్యాడు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఆరట్టు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తెలియజేస్తూ.. మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్‌తో షూట్లో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది… అంటూ తన లోకేషన్ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నారు. కాగా, అంతకుముందు మోహన్‌లాల్ నటించిన ‘మన్యం పులి’ సినిమాకు ఉన్నికృష్ణన్ కథ అందించారు.ఈ సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram
Also Read:
పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..