Pooja Hegde: ‘ఆచార్య’ నుంచి పూజా హెగ్డే ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. ఫోటో చూస్తే ‘ఎంత సక్కగున్నావే’ అనకుండా ఉండలేరు..

Pooja Hegde: చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడం, రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి..

Pooja Hegde: 'ఆచార్య' నుంచి పూజా హెగ్డే ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. ఫోటో చూస్తే 'ఎంత సక్కగున్నావే' అనకుండా ఉండలేరు..
Poojahegde
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 13, 2021 | 5:30 PM

Pooja Hegde: చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడం, రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. సురేఖ్‌ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇటు మెగా అభిమానులే కాకుండా యావత్‌ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే నేడు పూజా హెగ్డే పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ ‘ఆచార్య’లో పూజా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. పూజా ఇందులో నీలాంబరి పాత్రలో నటించనుంది. ఇక చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ విషయానికొస్తే. ఇందులో పూజా లంగావోణీలో అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆకట్టుకుంటోంది. పూజా పాత్రను పరిచయం చేస్తూ.. ‘మా నీలాంబరికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. పూజాను ఇలా చూసిన ఆమె అభిమానులు ‘ఎంత సక్కగా ఉన్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ‘ఆచార్య’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటోన్న పూజాకు ఈ ఇయర్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఏడాదిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూజా హెగ్డే ప్రస్తుతం ఆచార్యతో పాటు రాధేశ్యామ్‌, బీస్ట్‌ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ పాన్‌ ఇండియా చిత్రాలే కావడం విశేషం.

Also Read: Throwback Pic: ఈ ఫొటోలో నవ్వుతూ కెమెరా వైపు చూస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడీమె కుర్రాళ్ల కలల రాకుమారి..

AP Weather: మరో అల్పపీడనం ముప్పు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన

Teamindia New Coach: సీనియర్లు వద్దు.. జూనియర్లే ముద్దంటోన్న రాహుల్ ద్రవిడ్.. టీమిండియా కోచ్ పాత్రపై ఆసక్తి లేదంటోన్న దిగ్గజం..!