The Great Pre-Wedding Show Review : ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ.. సరదాగా సాగిపోయే సినిమా..
ఈ రోజుల్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి మంచి కాన్సెప్టులు వస్తున్నాయి. అలాంటి ఒక సరదా కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, పద్మావతి తదితరులు
ఎడిటర్: నరేష్ అడుప
సినిమాటోగ్రాఫర్: సోమశేఖర్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: అగరం సందీప్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
ఈ రోజుల్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి మంచి కాన్సెప్టులు వస్తున్నాయి. అలాంటి ఒక సరదా కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ఉత్తరాంధ్ర జిల్లాలో రమేష్ (తిరువీర్) ఒక ఫోటో స్టూడియో మైంటైన్ చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న ఫోటోలతో పాటు పెళ్లికి వీడియోలు తీస్తూ ఉంటాడు. అతడి ఫోటో స్టూడియోకు ఎదురుగా ఉన్న పంచాయతీ ఆఫీసులో సెక్రెటరీగా పనిచేస్తుంది హేమ (టీనా శ్రావ్య). రమేష్, హేమలకు ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్న బయటికి చెప్పుకోరు. ఇక అదే ఊర్లో ఉండే ఆనంద్ (నరేంద్ర రవి)కి సౌందర్య (యామిని నాగేశ్వర్)తో పెళ్లి కుదరడంతో ఒక మంచి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకోవాలని రమేష్ షాప్ కు వస్తాడు. రెండు లక్షల ఖర్చుపెట్టి గ్రాండ్ గా ఆ వీడియో కూడా తీస్తారు. తీరా తీసిన తర్వాత చిప్ ఎక్కడో పోగోడతారు. ఆ సమస్య నుంచి రమేష్ ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథ..
కథనం:
ఒక సినిమా చేయడానికి ప్రతిసారి పెద్ద పెద్ద సెటప్ అవసరం లేదు.. కాసేపు సరదాగా నవ్వించే కాన్సెప్ట్ ఉంటే చాలు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా విషయంలో ఇదే జరిగింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు పట్టుకోవడంలో తిరువీర్ ది స్పెషల్ స్టైల్. మసూద, పరేషాన్.. ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..! హీరో ఒక ఫోటోగ్రాఫర్.. ఒకరి పెళ్లికి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తాడు.. తీరా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ చిప్ పోగొడతారు.. అందులోంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే దాన్ని సరదాగా చెప్పాడు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్. చాలా సింపుల్ లైన్ తీసుకొని బాగా ఎంగేజ్ చేశాడు దర్శకుడు. తను రాసుకున్న లైన్ నుంచి బయటికి వెళ్లకుండా అందులోనే కావాల్సినంత ఫన్ జనరేట్ చేశాడు. ఫస్టాఫ్ అక్కడక్కడ మంచి ఉత్తరాంధ్ర చమక్కులతో వెళ్లిపోయింది.. సినిమాకు ప్రాణం సెకండాఫ్.. సరదా సన్నివేశాలతో అలాఅలా వెళ్ళిపోయింది సినిమా. కొన్ని సీన్స్ బాగా పేలాయి. ముఖ్యంగా కొత్త నటుడు నరేంద్ర తాను పోషించిన ఆనంద్ పాత్రలో అద్భుతంగా ఉన్నాడు. మనోడి ఎక్స్ప్రెషన్స్ చాలా చోట్ల సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. కథ మొత్తం అతని మీద రన్ అవుతుంది. క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశాడు.
నటీనటులు:
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఎవరు నటించినట్టు లేదు అందరూ జీవించారు. తిరువీర్ చాలా న్యాచురల్ గా నటించాడు.. కొత్తమ్మాయి టీనా శ్రావ్య కూడా బాగుంది. ఇందులో మెయిన్ హీరో నరేంద్ర రవి.. ఆనంద్ పాత్రలో మనోడు ఇరగ్గొట్టాడు. మరో ముఖ్యమైన పాత్రలో 90స్ వెబ్ సిరీస్ ఫేమ్ రోహన్ బాగా నటించాడు. ఈ పిల్లోడు కూడా చాలా చోట్ల తనదైన టైమింగ్ తో నవ్వించాడు. ఇక యామిని నాగేశ్వర్ కూడా సౌందర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. మిగిలిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. కేవలం గంటా 56 నిమిషాల సినిమా మాత్రమే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సింపుల్ కథను ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. సరదాగా సాగిపోయే సినిమా..!




