Telugu Indian Idol 2: ఇండియన్ ఐడల్ సింగర్ అయాన్ ప్రణతి పాటకు ఫిదా అయిన మెగాస్టార్.. స్వయంగా ఇంటికి ఆహ్వానించి
ఎంతో మంది ఔత్సాహిక సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తెలుగు ఇండియన్ ఐడల్. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సింగింగ్ రియాలిటీ షోకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. తొలి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని సెకండ్ సీజన్ సైతం రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది...

ఎంతో మంది ఔత్సాహిక సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంది తెలుగు ఇండియన్ ఐడల్. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సింగింగ్ రియాలిటీ షోకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. తొలి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని సెకండ్ సీజన్ సైతం రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇండియన్ ఐడల్ ద్వారా ప్రపంచానికి తమ ప్రతిభను పరిచయం చేసుకున్న వారిలో అయాన్ ప్రణతి ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఈ 14 ఏళ్ల చిన్నారి తన గాన మాదుర్యంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కేవలం వీక్షకులే కాకుండా జడ్జీలు కూడా ప్రణతి పాటకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రణతి పొగుడుతున్న వారి జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.
చిన్నారి ప్రతిభకు ఫిదా అయిన చిరంజీవి ప్రణతిని స్వయంగా ఇంటికి ఆహ్వానించారు. చిరంజీవి ఆయన సతీమణి సరేఖలో సమక్షంలో అన్నమాచార్య కీర్తను అలపించిన ప్రణతి మెగా జంటను అబ్బురపరిచింది. చిన్నారి పాటకు ఫిదా అయిన చిరు ప్రశంసలు కురిపించారు. అనంతరం తానే స్వయంగా ప్రణతితో సెల్ఫీ సైతం తీసుకున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్2లో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ఇక చిరంజీవిని కలుసుకోవడంపై ప్రణతి సంతోషం వ్యక్తం చేసింది. తమ ముందు పాడేందుకు అవకాశం కల్పించిన చిరంజీవి, సురేఖలకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇదంతా ఒక కలలా ఉందని చెప్పుకొచ్చింది ప్రణతి. ఇండియన్ ఐడల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరించేందుకు మరింత ప్రేరణ పొందానని, చిరంజీవిని కలవడం తనలో కొత్త విశ్వాసాన్ని నిప్పిందని ప్రణతి వివరించింది.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
