AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వామ్మో.. ఈ టాలీవుడ్ హీరోయిన్ మాముల్ది కాదు.. డాక్టర్‏ను ఇంటికి పిలిచి మొత్తం దోచేసింది..

వెండితెరపై నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఎన్ని సవాళ్లు ఉంటాయో చెప్పక్కర్లేదు. ఒక్క అవకాశం కోసం సంవత్సరాలు కష్టపడిన తారలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా కెరీర్ నాశనం చేసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ సైతం అదే కోవలోకి వస్తుంది.

Tollywood: వామ్మో.. ఈ టాలీవుడ్ హీరోయిన్ మాముల్ది కాదు.. డాక్టర్‏ను ఇంటికి పిలిచి మొత్తం దోచేసింది..
Athulya Chandra
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2026 | 6:58 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అతుల్య చంద్ర. మలయాళం, తెలుగులో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ హీరోయిన్ ఒక సంచలన కేసులో చిక్కుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కొచ్చికి చెందిన ఒక వైద్యుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడిందట. ఆమె పై వచ్చిన ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేరళ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ , మలయాళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం.. కొచ్చిలోని ఒక ప్రముఖ వైద్యుడిని లక్ష్యంగా చేసుకుని ఈ రాబరీ జరిగినట్లు తెలుస్తోంది.

కేరళలోని కొచ్చిలో అతుల్య చంద్ర.. నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లితో కలిసి సోమవారం తన అపార్ట్ మెంట్ నుంచి స్థానిక వైద్యుడికి ఫోన్ చేసింది. తన బంధువుకు అత్యవసర వైద్యసాయం అందించేందుకు ఇంటికి రావాలని ఆయనను పిలిచింది. ఉదయం ఆరున్నరకు డాక్టర్ వాళ్ల ఫ్లాట్ కు వెళ్లేసరికి అక్కడ దాదాపు 12 మంది యువతి యువకులు ఉన్నారు. అందరూ కలిసి సదరు డాక్టర్ పై దాడి చేసి అతడి దగ్గరున్న నగదు, ఫోన్, వాచ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ లాక్కున్నారు. ఇదంతా పోలీసులకు చెబితే వైద్యం కోసం వచ్చి మ బంధువుపై అత్యాచారానికి ప్రయత్నించావని కేసు పెడతామి బెదిరించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కొచ్చి పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, ఆధారాల ఆధారంగా అతుల్య చంద్రతో పాటు ఆమెతో ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి నుంచి భారీ మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను బెదిరించి గుంజినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా పరిచయమైన క్రైమ్ హాస్య చిత్రం ‘మత్తు వదలరా’ లో అతుల్య చంద్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఆ తర్వాత కొన్ని మలయాళ ప్రాజెక్టులలోనూ నటించారు. సినీ కెరీర్ ఆశాజనకంగా సాగుతున్న సమయంలోనే ఆమె ఇలాంటి నేరపూరిత ఉదంతంలో అరెస్ట్ కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, దోపిడీ వెనుక ఉన్న అసలు కారణాలు ,ఇతర వ్యక్తుల ప్రమేయంపై విచారిస్తున్నామని కేరళ పోలీసులు స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us