AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి శుభ్రత కోసం ప్రాణాలతో చెలగాటం.. బాల్కనీలో మహిళ సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇంటిని అందంగా అలంకరించడం, దీపాలు వెలిగించడం, పూజా కార్యక్రమాలకు సిద్ధం కావడం వంటి పనులతో కుటుంబ సభ్యులు బిజీగా ఉంటారు. ముఖ్యంగా దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఇంటిని శుభ్రం చేసే పనిలో ఏకంగా తన ప్రాణాలనే ప్రమాదంలో పెట్టుకుంది.

దీపావళి శుభ్రత కోసం ప్రాణాలతో చెలగాటం.. బాల్కనీలో మహిళ సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Woman Risks Her Life
Balaraju Goud
|

Updated on: Nov 06, 2026 | 6:51 PM

Share

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇంటిని అందంగా అలంకరించడం, దీపాలు వెలిగించడం, పూజా కార్యక్రమాలకు సిద్ధం కావడం వంటి పనులతో కుటుంబ సభ్యులు బిజీగా ఉంటారు. ముఖ్యంగా దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఇంటిని శుభ్రం చేసే పనిలో ఏకంగా తన ప్రాణాలనే ప్రమాదంలో పెట్టుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాల్కనీ బయట ప్రమాదకరంగా శుభ్రత పనులు!

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఎత్తైన భవనంలోని బాల్కనీ బయట ఉన్న ఇరుకైన ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ కనిపించింది. సాధారణంగా ఇలాంటి ప్రాంతాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక పరికరాలు, భద్రతా ఏర్పాట్లు అవసరం. కానీ ఆ మహిళ ఎలాంటి సేఫ్టీ బెల్ట్, రక్షణ పరికరాలు లేకుండానే ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లింది.

చేతిలో చీపురు, శుభ్రం చేసే వస్తువులు పట్టుకుని ఏమాత్రం భయం లేకుండా తన పనిని కొనసాగించింది. బాల్కనీ బయట ఉన్న ఇరుకైన ప్రదేశంలో నిలబడి ముందుకు వంగుతూ శుభ్రం చేసింది. అక్కడ సరైన రక్షణ కంచె కూడా కనిపించకపోవడంతో ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏమాత్రం అదుపు తప్పినా ఆమె కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీదేవి కోసం ఇంత సాహసమా?

ఈ వీడియోను సోషల్ మీడియాలో ఓ యూజర్ సరదా క్యాప్షన్‌తో షేర్ చేశారు. దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో మహిళ ఈ స్థాయిలో సాహసం చేస్తున్నట్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు. లక్ష్మీదేవి సంతోషించాలి కానీ, యమధర్మరాజు వచ్చేంత సాహసం చేయకూడదనే అర్థంలో కామెంట్ చేశారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు మహిళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు మాత్రం ఇంతటి ప్రమాదం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంటిని శుభ్రం చేయడం ముఖ్యమే కానీ ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హితవు పలుకుతున్నారు.

మొత్తానికి దీపావళి శుభ్రత పేరుతో మహిళ చేసిన ఈ సాహసం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే ఆందోళన కలిగిస్తోంది. పండుగ కోసం ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ పని చేసేటప్పుడు వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఎత్తైన ప్రదేశాల్లో శుభ్రత పనులు చేసేటప్పుడు సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఎప్పుడూ ప్రయత్నించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us