AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. 100 మిలియన్ల వ్యూస్.. ట్విస్టులే ట్విస్టులు

ఓటీటీలో మంచి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ తెలుగు సినిమా మీకు మంచి ఛాయిస్. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా ఇప్పటికే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. 100 మిలియన్ల వ్యూస్.. ట్విస్టులే ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 06, 2026 | 6:45 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు తదితర సినిమాలు ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. ఈమధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఒక తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. ఆద్యంత థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా ఊహించని విధంగా ఏకంగా 100 మిలియన్స్ అంటే పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను అధిగమించింది. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటని చెప్పవచ్చు. కాగా ఈ మధ్యన చిన్న సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. అందులోనూ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలనైతే ఓటీటీ ఆడియెన్స్ ఎగబడ మరీ చూస్తున్నారు. ఇందుకు మరో నిదర్శమనే ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మొదటి నుంచే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఒత్తిడితో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న స్వప్న.. ఫస్ట్ నైట్ రోజే తను వర్జిన్ కాదు అని భర్త బాలుతో చెబుతుంది. ఒకవైపు భర్తతో ఉంటూనే, పెళ్లికి ముందు ప్రేమించిన అబాన్ అనే యువకుడితో ఎఫైర్ కొనసాగిస్తుంది. ఇదంతా కనిపెట్టిన బాలు ఓ రోజు వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆ తర్వాత స్వప్న అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోతుంది. దీంతో బాలు పోలీసులను ఆశ్రయిస్తాడు. మరి అసలు స్వప్న ఏమైపోయింది? దీని వెనక ఎవరున్నారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు నా వైఫ్ మిస్సింగ్. ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఫేమ్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి ఈ సినిమాలో జంటగా నటించారు. దర్శకురాలు స్వాతి ప్రకాష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రవీణ్, జబర్దస్త్ సత్యశ్రీ కామెడీ, సాయి కార్తీక్ అందించిన ఇంటెన్స్ బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. పైగా ఈ సినిమా రన్ టైమ్ కూడా తక్కువే. అక్టోబర్ చివరి వారంలో ఆహా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా తాజాగా 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీనే స్వయంగా వెల్లడించింది. ‘ఒక హిస్టరీ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ నుంచి.. హెడ్‌లైన్స్‌లో నిలిచే సస్పెన్స్ థ్రిల్లర్ వరకు’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ ఇచ్చింది.

ఆహాలో నా వైఫ్ మిస్సింగ్..

h3>’నా వైఫ్ మిస్సింగ్’ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us