Bigg Boss 6: ఈవారం కూడా షాకింగ్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ హౌస్ నుంచి అవుట్

|

Nov 12, 2022 | 6:20 PM

నిజానికి ఈ సారి బిగ్ బాస్ అంతగా ఆకట్టుకోలేక పోయిందని హోస్ట్ నాగార్జుననే ఒకానొక సందర్భంలో ఒప్పుకున్నారు. ఏకంగా హౌస్ మేట్స్ ను బయటకు కూడా పంపేస్తా అని హెచ్చరించారు.

Bigg Boss 6: ఈవారం కూడా షాకింగ్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ హౌస్ నుంచి అవుట్
Bigg Boss 6
Follow us on

బిగ్ బాస్ అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 6 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది అని ప్రేక్షకులు అంటున్నారు. నిజానికి ఈ సారి బిగ్ బాస్ అంతగా ఆకట్టుకోలేక పోయిందని హోస్ట్ నాగార్జుననే ఒకానొక సందర్భంలో ఒప్పుకున్నారు. ఏకంగా హౌస్ మేట్స్ ను బయటకు కూడా పంపేస్తా అని హెచ్చరించారు. ఇక హౌస్ లో కి వచ్చిన వాళ్లలో చాలా మంది ముఖాలు మనకు తెలియదు కూడా.. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హూసునుంచి ఊహించని ఎలిమినేషన్స్  జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా మరో ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచేశారని తెలుస్తోంది. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న గీతు.. అనూహ్యంగా ఎలిమినేషన్‌ కావడంతో ఇప్పుడు ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు బయటకు రానున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే బాలాదిత్య, మెరీనా అని టాక్. ఇది కూడా ఊహించని ఎలిమినేషన్ అనే చెప్పాలి.  టాప్ 5లో ఉంటాడనుకున్న బాలాదిత్య ఈ వారం హౌస్ నుంచి బయటకు వచేస్తున్నాడని తెలుస్తోంది.

ఈవారంలో మొత్తం 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ వీళ్లంతా నామినేషన్స్‌లో ఉండగా.. బాలాదిత్య, మెరీనా బిగ్ బాస్ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. బాలాదిత్య ఆట పరంగా కాస్త వీక్ అయినా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో హౌస్ నుంచి బయటకు కూడా అలానే వస్తున్నారు. ఇక మెరీనా కూడా తన ఆటను మన్మెరుగు పరుచుకుంది. అయితే ఓట్లు తక్కువ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..