Vinod Thomas: ఆగి ఉన్న కారులో శవమై కనిపించిన ప్రముఖ నటుడు.. ఏసీనే ప్రాణాలు తీసిందా?
మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ థామస్ (45) అనుమానాస్పదంగా కన్నుమూశారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం (నవంబర్ 18) హోటల్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులో వినోద్ థామస్ మృతదేహం లభ్యమైంది. ఆయన మృతికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే వినోద్ మృతికి కచ్చితమైన కారణం తెలియనుందని తెలుస్తోంది
మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ థామస్ (45) అనుమానాస్పదంగా కన్నుమూశారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం (నవంబర్ 18) హోటల్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులో వినోద్ థామస్ మృతదేహం లభ్యమైంది. ఆయన మృతికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే వినోద్ మృతికి కచ్చితమైన కారణం తెలియనుందని తెలుస్తోంది. వినోద్ థామస్ మృతి కారులోని ఏసీ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని కొట్టాయంలోని ఓ హోటల్‌లో వినోద్ థామస్ కారు పార్క్ చేసి ఉంది. చాలా సేపటికి అతడు కారులోనే ఉండటాన్ని హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వినోద్ థామస్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. వినోద్ థామస్ పలు మలయాళ సినిమాల్లో నటించారు. ‘అయ్యప్పనుమ్ కోషియిమ్’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘జూన్’ వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళ బుల్లితెర ప్రేక్షకులకు కూడా వినోద్ థామస్ బాగా పరిచయస్తుడే. థామస్ అకాల మరణంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వినోద్ థామస్ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, బంధువులు ప్రార్థిస్తున్నారు.
కాగా కారులోని ఏసీ నుంచి విష వాయువు లీక్ కావచ్చు. వినోద్ థామస్ శరీరంలోకి చేరడం వల్లే తుది శ్వాస విడిచి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. ప్రస్తుతం వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి గల కచ్చితమైన కారణం బయటకు రానుంది. కాగా వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వినోద్ మృతిపై పలు కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనతో వినోద్ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు.
ఏసీ నుంచి విష వాయువులు..
Malayalam serial and movie actor vinod Thomas was found dead in his car outside a bar at Pambady near Kottayam yday evening. pic.twitter.com/XrPZWAO25V
— മുരളി (@muralewrites) November 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.