Malavika Mohanan: అలా ఉన్నందుకు ట్రోల్ చేశారు.. ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది మాళవిక మోహనన్. ఇప్పటికే మలయాళం, తమిళం, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా ఇండస్ట్రీలో ఎదురయ్యే బాడీ షేమింగ్ ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది.

Malavika Mohanan: అలా ఉన్నందుకు ట్రోల్ చేశారు.. ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Malavika Mohanan
Follow us

|

Updated on: Oct 26, 2024 | 1:34 PM

అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ మాళవిక మోహనన్. 2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా చిత్రంలో కనిపించింది. ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలలో హీరోయిన్స్ పట్ల వచ్చే ట్రోల్స్, విమర్శలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

చాలా సన్నగా ఉండడం వల్ల మలయాళంలో తాను ట్రోల్స్ ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళంలో సన్నగా ఉన్న కాంప్లిమెంట్స్ వస్తాయని.. కాస్త లావుగా ఉన్న కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాలంటే స్లిమ్ గా ఉండాల్సిందేనని.. అక్కడ ఫిట్నెస్ కు చాలా డిమాండ్ ఉంటుందని తెలిపింది. భారతీయ సినిమాలో రకరకాల ప్రమాణాలు ఉన్నాయని.. బరువు తగ్గినా, స్లిమ్ అయినా తెలుగు, తమిళంలో కాంప్లిమెంట్స్ మాత్రం వస్తాయని.. మలయాళంలో మాత్రం బొద్దుగా ఉంటే బాగుంటుందని చెబుతారని తెలిపింది.

మాళవిక చివరిసారిగా తంగళాన్ చిత్రంలో నటించింది. చియాన్ విక్రమ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అలాగే సిద్ధాంత్ చతుర్వేది సరసన హిందీ యాక్షన్ చిత్రం ‘యుద్ర’లో కూడా నటించింది. మాళవిక రాబోయే ప్రాజెక్ట్‌లలో తమిళ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’, రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’ ఉన్నాయి.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!