మరోసారి నిరాశపరిచిన కీర్తిసురేష్ సినిమా.. మరీ ఇంత దారుణంగా రేటింగ్ వచ్చిందేంటి.!
అందాల భామ కీర్తి సురేష్ కు దెబ్బమీద దెబ్బ తగులుతుంది.మహా నటి సినిమా తర్వాత ఆచి తూచి సినిమా లు చేస్తున్నప్పటికీ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.

అందాల భామ కీర్తిసురేష్ ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతుంది. మహానటి సినిమా తర్వాత ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నప్పటికీ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇటీవల కీర్తి సురేష్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో సినిమాలన్నీ ఓటీటీలనే నమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. వీటిలో మిస్ ఇండియా సినిమా పర్లేదు అనిపించుకున్న పెంగ్విన్ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమాపై కీర్తిసురేష్ తోపాటు, మేకర్స్ కూడా భారీగా ఆశాలు పెట్టుకున్నారు. కానీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు శాటిలైట్స్ రేటింగ్ విషయంలోనూ నిర్మాతలను దారుణంగా నిరాశపరిచింది. గత నెలలో ఈ సినిమాను ఓ ఛానల్ వరల్డ్ ప్రీమియర్ చేసారు. కాస్త ఎక్కువ రేటుకే ఈ సినిమాను కొనుగోలు చేసిన సదరు ఛానల్ కు కనీస రేటింగ్ కూడా రాలేదు. 8 నుంచి 10 రేటింగ్ వస్తుందనుకుంటే కేవలం 3.64 రేటింగ్ ను మాత్రమే దక్కించుకుంది పెంగ్విన్. దాంతో ఓటీటీతోపాటు శాటిలైట్ లో దెబ్బపడింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నితిన్ తో ‘రంగ్ దే’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది.
