విరుష్క దంపతులు ఒక్కటై నేటికి మూడేళ్లు.. ఆస్ట్రేలియాలో విరాట్.. ఇండియాలో అనుష్క.. సోషల్ మీడియాలో భావేద్వేగ పోస్ట్..

సెలబ్రిటీ కపుల్ విరుష్క దంపతులు ఒక్కటై నేటికి మూడేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేదీన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తాళిబంధంతో ఒక్కటయ్యారు.

  • Shiva Prajapati
  • Publish Date - 3:27 pm, Fri, 11 December 20
విరుష్క దంపతులు ఒక్కటై నేటికి మూడేళ్లు.. ఆస్ట్రేలియాలో విరాట్.. ఇండియాలో అనుష్క.. సోషల్ మీడియాలో భావేద్వేగ పోస్ట్..

సెలబ్రిటీ కపుల్ విరుష్క దంపతులు ఒక్కటై నేటికి మూడేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేదీన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ తాళిబంధంతో ఒక్కటయ్యారు. నేడు విరాట్, అనుష్క ఇద్దరూ ఒక్కచోట లేకపోయినా.. వారి వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియాలో అనుష్క శర్మ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అనుష్క కాస్త భావోద్వాగానికీ గురైంది. ‘మనకి మూడేళ్లు.. అతి త్వరలోనే మన ఇద్దరం కాస్తా ముగ్గురం అవబోతున్నాం. మిస్ యూ’ అంటూ కోహ్లీని ఉద్దేశించి అనుష్క పోస్ట్ చేసింది. ఇక విరాట్ సైతం అనుష్క శర్మపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. పెళ్లినాటి ఫోటోనొకదానిని ట్వీట్ చేసిన విరాట్.. ‘మన బంధానికి మూడేళ్లు.. ప్రేమతో జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా విరుష్క జోడీకి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. 2017 డిసెంబర్ 11వ తేదీన ఇటలీలో రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. 2021 జనవరి నాటికి విరుష్క దంపతులకు పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెన్సీతో ఉండగా, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు. త్వరలో ఆసిస్‌తో జరగనున్న పింక్‌ బాల్ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో విరాట్ ఆడనున్నాడు. ఆ టెస్ట్ తరువాత విరాట్.. పెటర్నిటీ లీవ్స్‌పై ఇండియాకు తిరిగి రానున్నారు. అనుష్క డెలివరీ టైమ్‌కి విరాట్ ఆమె పక్కన ఉండనున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)