‘మజిలీ’ షూటింగ్ పూర్తి

‘మజిలీ’ షూటింగ్ పూర్తి

నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తోన్న నాల్గొవ చిత్రం మజిలీ. ‘నిన్నుకోరి’తో ప్రేక్షకులను మెప్పించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్‌ గురువారం పూర్తైంది. ఈ విషయాన్ని తమ తమ సోషల్ మీడియాలో వెల్లడించారు నాగ చైతన్య, సమంత. ఈ సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేసుకొని.. అద్భుతమైన టీమ్‌తో పనిచేశామని తమ అనుభూతిని వ్యక్తపరిచారు. కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Apr 28, 2019 | 7:14 AM

నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తోన్న నాల్గొవ చిత్రం మజిలీ. ‘నిన్నుకోరి’తో ప్రేక్షకులను మెప్పించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్‌ గురువారం పూర్తైంది. ఈ విషయాన్ని తమ తమ సోషల్ మీడియాలో వెల్లడించారు నాగ చైతన్య, సమంత. ఈ సందర్భంగా ఓ ఫొటోను షేర్ చేసుకొని.. అద్భుతమైన టీమ్‌తో పనిచేశామని తమ అనుభూతిని వ్యక్తపరిచారు. కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహానంతరం చైతూ, సమంత కలిసి నటిస్తోన్న ఈ చిత్రంపై ఇటు అభిమానుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu