AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లారిటీ ఇచ్చేసిన రానా

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై స్పందించాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు రానా వెల్లడించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుందని, అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో […]

క్లారిటీ ఇచ్చేసిన రానా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 22, 2019 | 10:52 AM

Share

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఓ చిత్రంలో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై స్పందించాడు రానా.

వేణు ఊడుగుల దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు రానా వెల్లడించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుందని, అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపించనున్నాట్లు తెలుస్తోంది. జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.