మహేశ్ అభిమానులకు భారీ షాక్..?

మహేశ్ అభిమానులకు భారీ షాక్..?

సూపర్‌స్టార్ అభిమానులకు భారీ షాక్ తగలనుంది. మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ‘మహర్షి’ వాయిదా పడనుంది. ఏప్రిల్‌లో ఈ చిత్ర విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేయగా.. అది కాస్త ఇప్పుడు జూన్‌కు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా పూర్తి కావల్సిన టాకీ పార్ట్ చాలానే ఉంది. ఆ తరువాత మిగిలి ఉన్న రెండు పాటలను ప్రత్యేక సెట్‌లో తెరకెక్కించనున్నారు. వీటన్నింటిని పూర్తి చేసిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటించాలని నిర్మాతలు అనుకుంటున్నారట. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:02 PM

సూపర్‌స్టార్ అభిమానులకు భారీ షాక్ తగలనుంది. మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ‘మహర్షి’ వాయిదా పడనుంది. ఏప్రిల్‌లో ఈ చిత్ర విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేయగా.. అది కాస్త ఇప్పుడు జూన్‌కు వెళ్లనుందని తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించి ఇంకా పూర్తి కావల్సిన టాకీ పార్ట్ చాలానే ఉంది. ఆ తరువాత మిగిలి ఉన్న రెండు పాటలను ప్రత్యేక సెట్‌లో తెరకెక్కించనున్నారు. వీటన్నింటిని పూర్తి చేసిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటించాలని నిర్మాతలు అనుకుంటున్నారట. దీంతో మరో రెండు నెలలు ఈ మూవీ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేశ్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu