అదరగొడుతున్న ‘మజిలీ’ ప్రీ రిలీజ్ బిజినెస్

| Edited By: Anil kumar poka

Apr 02, 2019 | 1:02 PM

పెళ్లి తరువాత అక్కినేని కపుల్ నాగచైతన్య, సమంతలు కలిసి నటించిన తొలి సినిమా ‘మజిలీ’.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.  ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి జరుగుతున్నా… సినిమాపై నమ్మకంతో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధం అయింది.  మజిలీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం.  […]

అదరగొడుతున్న మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్
Follow us on

పెళ్లి తరువాత అక్కినేని కపుల్ నాగచైతన్య, సమంతలు కలిసి నటించిన తొలి సినిమా ‘మజిలీ’.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.  ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి జరుగుతున్నా… సినిమాపై నమ్మకంతో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధం అయింది.  మజిలీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం.  తాజా సమాచారం ప్రకారం ‘మజిలీ’కి వరల్డ్ వైడ్ గా రూ. 21.14 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు ‘మజిలీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.  క్రికెట్ అంటే ప్రాణంగా భావించే వ్యక్తి, అటు క్రికెట్ కు, ప్రేమించిన అమ్మాయికి దూరం కావడం.. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితంలో ఇబ్బందులు పడటం వంటి వాటిని సినిమాలో చక్కగా చూపించారట.  ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ చెప్తోంది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.