Mahesh Babu : ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న మహేష్ వర్కౌట్ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు నుంచి రాబోతున్న ఈ సినిమా పై...

Mahesh Babu : ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టిన సూపర్ స్టార్.. వైరల్ అవుతున్న మహేష్ వర్కౌట్ వీడియో
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 21, 2021 | 5:33 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు నుంచి రాబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి ఫేమ్ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.

ఇక మహేష్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ఏజ్ రోజురోజుకు తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక మహేష్ బాబు ఫిట్నెస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. మహేష్ అందానికి.. ఫిట్ నెస్ కు ఫిదా అయిన లేడీ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఆయన్ను ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు. తాజాగా తన జిమ్ వీడియోను షేర్ చేసాడు మహేష్. వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.