కన్నడ నాట ‘సరిలేరు’ అనిపించిన మహేష్‌

కన్నడ నాట 'సరిలేరు' అనిపించిన మహేష్‌

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 6:19 PM

Mahesh Babu Sarileru Neekevvaru: సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక బుల్లితెరపైన కూడా ఈ మూవీ అత్యధిక రేటింగ్‌ని దక్కించుకుంది. ఉగాది సందర్భంగా టీవీల్లో ప్రీమియర్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’కు 23.4 టీఆర్పీ రేటింగ్‌ రాగా.. ‘బాహుబలి 2’ రికార్డును సైతం బ్రేక్ చేసింది. తాజాగా ఈ చిత్రం కన్నడ నాట కూడా రికార్డు సృష్టించింది.

సరిలేరు నీకెవ్వరును కన్నడలో డబ్‌ చేసి ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించారు. అక్కడ ఈ చిత్రం 6.5 రేటింగ్‌ని సాధించింది. ఈ మూవీ తరువాత తెలుగులో చిరంజీవి నటించిన హిస్టారికల్ డ్రామా సైరా(6.3), రామ్ చరణ్‌ పీరియాడిక్ డ్రామా రంగస్థలం(6), విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గీతా గోవిందం(5.6)లు ఉన్నాయి. కాగా యాక్షన్‌-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరులో మహేష్‌ సరసన రష్మిక నటించింది. విజయశాంతి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్‌, సంగీత తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Read This Story Also: గేట్స్ ఫౌండేషన్‌, గవితో ‘సీరం’ ఒప్పందం.. రూ.225కే కరోనా వ్యాక్సిన్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu